మరో మలుపు తిరిగిన కర్ణాటక సంక్షోభం

మరో మలుపు తిరిగిన కర్ణాటక సంక్షోభం
x
Highlights

కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. నిర్ణీత నమునాలో రాజీనామాలు సమర్పించిన ముగ్గురికి తనను కలిసేందుకు అవకాశం కల్పించారు స్పీకర్...

కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. నిర్ణీత నమునాలో రాజీనామాలు సమర్పించిన ముగ్గురికి తనను కలిసేందుకు అవకాశం కల్పించారు స్పీకర్ రమేశ్ కుమార్. సాయంత్రం 4 గంటలకు ఆ ముగ్గురు స్పీకర్‌ను కలువనున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ జరుగనుంది.

నేటి నుంచి విధాన సభ సమావేశాలు జరగనున్నాయి. సభ్యులందరూ సభకు హాజరు కావాలంటూ కాంగ్రెస్, జేడీఎస్ విప్ జారీ చేశాయి. అసమ్మతి నేతల బృందంలోని కాంగ్రెస్ సభ్యులు రమేశ్ జార్ఖిహోళి, మహేశ్ కమటహళ్లి, జేడీఎస్‌కు చెందిన గోపాలయ్య, హెచ్.విశ్వనాథ్, నారాయణ గౌడలపై స్పీకర్‌కు రెండు పార్టీల నేతలు ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పీకర్ తన నిర్ణయాన్ని ఇవాళ ప్రకటించనున్నారు. మరోవైపు ప్రస్తుత పరిస్థితులపై బీజేపీ పట్టు బిగించింది. ఇటు ముఖ్యమంత్రి కుమార స్వామి రాజీనామా కోసం ఒత్తిడి తేవాలని యోచిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories