15 రోజులుగా పాపకు దూరం... నెటిజన్లను కదిలిస్తున్న నర్సు వీడియో

15 రోజులుగా పాపకు దూరం... నెటిజన్లను కదిలిస్తున్న నర్సు వీడియో
x
Highlights

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం వేస్తుంది. కరోనా భాదితులను చికిత్సను అందించేందుకు డాక్టర్లు, నర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం వేస్తుంది. కరోనా భాదితులను చికిత్సను అందించేందుకు డాక్టర్లు, నర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు.ఇంటికి దూరంగా ఉంటూ మరి సేవలను అందిస్తున్నారు. ఇప్పుడు వారు అందిస్తున్న సేవలకి దేశం మొత్తం సలాం అంటుంది. తాజాగా కర్ణాటకలోని ఓ నర్సు 15 రోజులుగా ఇంటికి దూరంగా ఉంటూ కరోనా రోగుల ఐసోలేషన్ వార్డులో విధులు నిర్వహిస్తుంది.

ఈ క్రమంలో ఆమె పాప తల్లికోసం ఏడుస్తోంది. ఇది చూసి తట్టుకోలేని ఆ నర్సు భర్త, ఆ పాప తండ్రి ఆసుపత్రి వద్దకు తీసుకొచ్చాడు. అమ్మా అంటూ ఏడుస్తున్న తన బిడ్డ ఏడుస్తుంటే ఎం చేయలేకా ఆ తల్లి తాకకుండా తనను తాను నియంత్రించుకుంటూ మనోవేదనకి గురైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. సుగంధ అనే మహిళ కర్ణాటకలోని బెళగావి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ కాలేజీ (బీమ్స్) ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వర్తిస్తుంది. కరోనా భాదితులకి చికిత్స అందిస్తూ 15 రోజులుగా ఆమె ఇంటికి వెళ్ళడం లేదు. దీనితో ఆమె పాప అమ్మ కావాలి అంటూ ఏడవడం మొదలు పెట్టింది. అన్నం తినడం మానేసింది.

ఈ నేపధ్యంలో ఆమె భర్త శ్రీకాంత్ పాపను తీసుకొని ఆస్పత్రి వద్దకు వెళ్లి తన భార్యకు ఫోన్ చేసి బయటకు రమ్మన్నాడు. తల్లిని చూడగానే ఆ చిన్నారి.. 'అమ్మా, దగ్గరికి రా..' అంటూ ఏడ్చింది. కానీ కరోనా భయంతో సుగంధ దూరం నుంచే పాపను చూసుకుని ఓదార్చి కన్నీళ్లతో లోపలికి వెళ్లిపోయింది. ఈ సంఘటన అందరిని కలిచివేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సంఘటన కాస్తా కర్ణాటక సీఎం యెడియూరప్ప దృష్టికి వెళ్లింది. దీనిపైన వెంటనే అయన ఆ నర్సుకు ఫోన్‌ చేసి మాట్లాడారు. "మీరు మీ పిల్లలను చూడకుండా చాలా కష్టపడుతున్నారు. మీ సేవలను తప్పకుండా గుర్తు పెట్టుకుంటాం. మీకు భవిష్యత్‌లో మంచి అవకాశాలు లభిస్తాయి. మిమ్మల్ని ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు అంటూ ఆమెలో దైర్యం నింపారు. ఇలాంటి సంఘటనే చైనాలో కూడా ఒకటి చోటు చేసుకుంది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories