logo

రాజీనామా దిశగా స్వామి అడుగులు

రాజీనామా దిశగా స్వామి అడుగులు
Highlights

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం బలపరీక్ష...

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం బలపరీక్ష నిర్వహిస్తామని స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ ప్రకటించడంతో సీఎం కుమారస్వామి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ సాయంత్రం 7 గంటలకు రాష్ట్ర గవర్నర్‌ వాజూభాయ్‌ వాలా అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని విజ్నప్తి చేశారు. సభలో మేజిక్‌ ఫిగర్‌కు కావాల్సిన సభ్యులు లేకపోవడం అసమ్మతి ఎమ్మెల్యేలు దారికి వస్తారని అనుకున్నా ఆ దిశగా చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు.

కర్ణాటక హైడ్రామా క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ నెల 18న విశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించిన స్పీకర్ ఈ సాయంత్రం విశ్వాసపరీక్షపై ఓటింగ్‌ నిర్వహిస్తామని ప్రకటించారు. దీనికి సభ్యులంతా చర్చకు సహకరించాలంటూ కోరారు. ఈ నేపథ్యంలో విధానసభకు చేరుకున్న సీఎం కుమారస్వామి, స్పీకర్ రమేష్ కుమార్ తో భేటీ అయ్యారు. బలపరీక్షకు మరో రోజు గడువు కోరారు. మరోవైపు రెబెల్ ఎమ్మెల్యేలు సహకరించాలంటూ కుమారస్వామి లేఖ కూడా రాశారు. మరోవైపు మధ్యాహ్నం సభ వాయిదా పడ్డ సమయంలో సిద్ధరామయ్య స్పీకర్‌తో భేటీ అయ్యారు. సాయంత్రం 6 గంటలకు బలపరీక్ష నిర్వహించాలని కోరారు.


లైవ్ టీవి


Share it
Top