Top
logo

కర్ణాటక అసెంబ్లీలో హై డ్రామా.. బీజేపీ నేతలపై కుమారస్వామి ఆగ్రహం

కర్ణాటక అసెంబ్లీలో హై డ్రామా.. బీజేపీ నేతలపై కుమారస్వామి ఆగ్రహం
X
Highlights

కర్నాకట అసెంబ్లీలో హై డ్రామా నెలకొంది. అవిశ్వాస తీర్మాన నేపధ్యంలో రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ఎవరూ సభకు...

కర్నాకట అసెంబ్లీలో హై డ్రామా నెలకొంది. అవిశ్వాస తీర్మాన నేపధ్యంలో రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ఎవరూ సభకు హాజరుకాలేదు. అయితే పలువురు బీజేపీ సభ్యులతో కాంగ్రెస్ నేతలు మంతనాలు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మాజిక్ ఫిగర్‌కు నలుగురు సభ్యులు మాత్రమే తక్కువ ఉండటంతో బేరసారాలు జరుపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సమావేశాలు ప్రారంభమైన అనంతరం బీజేపీ నేతలపై సీఎం కుమారస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ లకు చెందిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి సుప్రీంకోర్టు వెళ్లేందకు బీజేపీనే సాయం చేసిందని కుమారస్వామి ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నుతున్నది ఎవరో సభలో చెప్పాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు.

Next Story