ఆందోళనకారులకు సెంటిమెంట్‌ టచ్‌.. జాతీయ గీతం పాడించిన డీసీపీ

ఆందోళనకారులకు సెంటిమెంట్‌ టచ్‌.. జాతీయ గీతం పాడించిన డీసీపీ
x
డీసీపీ చేతన్ సింగ్
Highlights

పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు సద్దుమనగలేదు. పలు ప్రాంతాల్లో భారీ ప్రదర్శనలు చేపట్టారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ...

పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు సద్దుమనగలేదు. పలు ప్రాంతాల్లో భారీ ప్రదర్శనలు చేపట్టారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బెంగళూరులోని టౌన్ హాల్ దగ్గర ఆందోళనలు జరిగాయి. నిరసనకారుల్ని అక్కడి నుంచి పంపించేందుకు ఏం చేసినా వాళ్లు వెళ్లలేదు. దీంతో బెంగళూరు డీసీపీ చేతన్ సింగ్ రాథోడ్ సహా పోలీసులు అక్కడకు చేరుకుని వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

సంఘ వ్యతిరేక శక్తులు తమ స్వప్రయోజనాల కోసం ఇలాంటి ఆందోళనలు చేయిస్తున్నాయని డీసీపీ హెచ్చరించారు. అయినా నిరసనకారులు వెనక్కుతగ్గకపోవడంతో డీసీపీ రాథోడ్ వెంటనే జాతీయ గీతం ఆలపించారు. అది వినగానే ఆందోళనకారులు కూడా లేచి డీసీపీతో కలిసి జాతీయ గీతం పాడారు. అనంతరం మౌనంగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories