కర్'నాటకం: స్పీకర్‌ నిర్ణయం.. ఉత్కంఠ!

కర్నాటకం: స్పీకర్‌ నిర్ణయం.. ఉత్కంఠ!
x
Highlights

కర్నాటకలోరాజకీయ పరిణామాలు తారా స్ధాయికి చేరాయి. ఓవైపు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు పట్టు వీడక పోవడం మరో వైపు బీజేపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు...

కర్నాటకలోరాజకీయ పరిణామాలు తారా స్ధాయికి చేరాయి. ఓవైపు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు పట్టు వీడక పోవడం మరో వైపు బీజేపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునివ్వడంతో భవిష్యత్ రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు కాంగ్రెస్ శాసససభా పక్షం భేటి అయ్యింది. సిద్ధరామయ్య ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ భేటికి రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. అయితే రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు అనర్హత వేటు వేయాలంటూ కోరాలని పలువురు ఎమ్మెల్యేలు సూచించారు. అయితే తొందరపాటు నిర్ణయాలు వద్దన్న పలువురు సీనియర్లు రాజీ ధోరణిలో ఆచితూచి వ్యవహరించాలని సూచించారు. ఇదే సమయంలో బీజేపీ పంచన చేరిన ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.

ప్రస్తుత బలబలాల ప్రకారం సభలో ఇద్దరు స్వతంత్ర సభ్యులతో కలిపి బీజేపీకి 107 బలముండగా కాంగ్రెస్‌కు 104 మంది సభ్యుల బలం ఉంది. ఈ నేపధ్యంలో బీజేపీ బలం తగ్గించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసినా బీజేపీ ఒక్క ఓటు ఆధిక్యంలో ఉండే అవకాశాలున్నాయి. ఈ నేపధ్యంలో అసంతృప్త ఎమ్మెల్యేల్లో కనీసం ఇద్దరినీ అయినా తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేల రాజీనామా అంశాన్ని స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ నేడు పరిశీలించనున్నారు. స్పీకర్ రమేశ్ కుమార్ నేడు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది సర్వత్రా తీవ్ర ఆసక్తి రేపుతోంది. స్పీకర్‌ ఒకవేళ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదిస్తే మాత్రం సంకీర్ణ ప్రభుత్వం పడిపోయే అవకాశముంది. ఇక, స్పీకర్‌ రాజీనామాలు ఆమోదించకుండా దాటవేత ధోరణి అవలంబిస్తే కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమికి కొంత సమయం దొరికినట్టు అవుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories