కర్ణాటక రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత..పోటాపోటీగా కాంగ్రెస్, బీజేపీ ఆందోళనలు

Highlights

కర్ణాటకలో రాజకీయ రసవత్తరంగా మారింది. కర్ణాటక రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్, బీజేపీ ఆధ్వర్యంలో పోటాపోటీగా ఆందోళన...

కర్ణాటకలో రాజకీయ రసవత్తరంగా మారింది. కర్ణాటక రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్, బీజేపీ ఆధ్వర్యంలో పోటాపోటీగా ఆందోళన చేపట్టారు. తాజా రాజకీయాలపై గవర్నర్‌ను కలిసిన యడ్యూరప్ప, బీజేపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తమన ఆహ్వానించాలని కోరారు.

అంతకు ముందు మైనార్టీలో పడిపోయిన ప్రభుత్వం దిగిపోవాలని బీజేపీ నేతలు విధాన సభ ఎదుట ఆందోళనకు దిగారు. సీఎం పదవికి కుమారస్వామి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు బెంగుళూరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కర్ణాటకలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని ఆరోపించారు. ఇటు లోక్‌ సభలోనూ కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ముంబైలో రెబెల్ ఎమ్మెల్యేలు ఉన్న హోటల్ వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories