సుప్రీం తీర్పుతో మారుతున్న కర్నాటక రాజకీయాలు

సుప్రీం తీర్పుతో మారుతున్న కర్నాటక రాజకీయాలు
x
Highlights

గత పక్షం రోజులుగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న కన్నడ రాజకీయం తుది అంకానికి చేరింది. కుమారస్వామి ప్రభుత్వ మనుగడకు సంబంధించిన కీలక తీర్పును సుప్రీంకోర్టు...

గత పక్షం రోజులుగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న కన్నడ రాజకీయం తుది అంకానికి చేరింది. కుమారస్వామి ప్రభుత్వ మనుగడకు సంబంధించిన కీలక తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలపై తుది నిర్ణయం స్పీకర్‌దేనని, రాజీనామాల విషయంలో శాసన సభాపతికి పూర్తి అధికారం ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం​ చేసింది. అంతేకాకుండా కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించుకోవచ్చునని తేల్చి చెప్పింది. రేపు జరగనున్న బలపరీక్షకు హాజరుకావాలా? వద్దా? అన్నది రెబెల్‌ ఎమ్మెల్యేల ఇష్టమని సుప్రీంకోర్టు పేర్కొంది.

మరోవైపు సుప్రీం కోర్టు తీర్పును బీజేపీ స్వాగతించింది. సంకీర్ణ ప్రభుత్వం పడిపోవడం ఖాయమని ఎంపీ జీవీఎల్ తెలిపారు. రెబల్ ఎమ్మెల్యేలకు విప్ వర్తించదని అన్నారు. అలాగే సుప్రీం కోర్టు తీర్పు అసంతృప్త ఎమ్మెల్యేల నైతిక విజయమని యడ్యూరప్ప తెలిపారు. ఈ నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్యేలు సభకు హాజరుకావడంపై ఉత్కంఠ నెలకొంది. రేపటిలోగా స్పీకర్ వేటు వేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. రేపు బలపరీక్ష ఎదుర్కొనున్న కుమారస్వామి ప్రభుత్వం పరిస్థితి ఏమిటనే చర్చ జరుగుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories