Top
logo

సల్మాన్ ఖాన్‌పై జోథ్‌పూర్ కోర్టు సీరియస్

సల్మాన్ ఖాన్‌పై జోథ్‌పూర్ కోర్టు సీరియస్
X
Highlights

కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పై జోథ్ పూర్ కోర్టు సీరియస్ అయింది. ఈ కేసులో సల్మాన్...

కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పై జోథ్ పూర్ కోర్టు సీరియస్ అయింది. ఈ కేసులో సల్మాన్ కోర్టుకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. లేకుంటే సల్మాన్ కు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేస్తానని జోథ్ పూర్ కోర్టు జడ్జి హెచ్చరించారు. కృష్ణజింకను వేటాడిన కేసులో సల్మాన్‌కు జోథ్‌పూర్‌ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులో ఆయన బెయిల్‌ మీద బయట ఉన్నారు. జోథ్‌పూర్‌ కోర్టు గురువారం ఈ కేసు విచారణను చేపట్టింది. ఈ విచారణకు సల్మాన్‌ హాజరు కావాల్సి ఉండగా.. ఆయన కోర్టుకు రాలేదు. దీంతో కోర్టు సల్మాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Next Story