కమలం ఖాతా నుంచి వెళ్లిన జార్ఖండ్.. ఏడాదికాలంలో 5 రాష్ట్రాలను చేజార్చుకున్న బీజేపీ

కమలం ఖాతా నుంచి వెళ్లిన జార్ఖండ్.. ఏడాదికాలంలో 5 రాష్ట్రాలను చేజార్చుకున్న బీజేపీ
x
మోడీ, షా
Highlights

బీజేపీ నుంచి మరో రాష్ట్రం చేజారిపోయింది. మహారాష్ట్ర తర్వాత జార్ఖండ్‌ కూడా కమల దళానికి ఝలక్ ఇచ్చింది. 370 ఆర్టికల్ రద్దు, అయోధ్య తీర్పు తర్వాత వచ్చిన...

బీజేపీ నుంచి మరో రాష్ట్రం చేజారిపోయింది. మహారాష్ట్ర తర్వాత జార్ఖండ్‌ కూడా కమల దళానికి ఝలక్ ఇచ్చింది. 370 ఆర్టికల్ రద్దు, అయోధ్య తీర్పు తర్వాత వచ్చిన ఎన్నికల ఫలితాలు మోడీ, షా ధ్వయం జీర్ణించుకోలేకపోతోంది. ఒక్క ఏడాదిలో ఏకంగా 5 రాష్ట్రాలు కోల్పోవడం బీజేపీ అధిష్టానానికి మింగుడు పడటం లేదు.

దేశంలో రెండోసారి అధికారంలోకొచ్చిన కమలదళానికి సరికొత్త షాకులు తగులుతూనే ఉన్నాయి. మహారాష్ట్ర తర్వాత జార్ఖండ్‌ కూడా కమలం ఖాతా నుంచి వెళ్లిపోయింది. జార్ఖండ్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకున్న బీజేపీ హైకమాండ్‌ ఎన్నికలను ప్రటిష్టాత్మకంగా తీసుకుంది. ప్రచారంలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా తో పాటు హేమాహేమీలు పాల్గొన్నారు. అయినా లాభం లేకుండా పోయింది. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని దక్కించుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతోంది.

ప్రచారంలో భాగంగా అయోధ్య అంశాన్ని బీజేపీ ప్రస్తావించింది. సుప్రీం తీర్పును ప్రచారంలో వాడుకున్నారు. అలాగే ఆర్టికల్ 370 రద్దు, పాకిస్తాన్ దాడులు వంటి అంశాలను ప్రస్తావించారు. ఆ సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అయినా జార్ఖండ్‌ ప్రజలు బీజేపీని విశ్వసించలేదు. ఫలితాల్లో మెజార్టీకి దూరంగానే ఉంచారు.

ఇటు పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తుతున్న సమయంలో జార్ఖండ్‌ ఫలితాలు విపక్షాలకు బూస్ట్‌ ఇచ్చినట్లైంది. ప్రభుత్వ పనితీరుకు ఈ ఫలితాలు నిదర్శనమనే సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అధికారంలో ఉన్న ఒక్కో రాష్ట్రాన్ని చేజార్చుకుంటున్న బీజేపీ ఏడాదిలో ఏకంగా 5 రాష్ట్రాలను చేజార్చుకుంది.

జార్ఖండ్ ఫలితాల తర్వాత విపక్షాలు బీజేపీపై తీవ్ర విమర్శలు చేశాయి. బీజేపీకి చెంపపెట్టు అని ఎన్సీపీ, శివసేన పార్టీ ప్రతినిధులు విమర్శించారు. మోడీ, షా ద్వయానికి ఈ ఫలితాలు గర్వభంగం అని అన్నారు. బీజేపీపై ప్రజలకు రోజు రోజుకూ నమ్మకం తగ్గిపోతుందని ప్రస్తుత పరిస్థితులే అందుకు నిదర్శనమని శివసేన తెలిపింది. ప్రజాస్వామ్యం గెలిచిందంటూ ట్వీట్‌లు చేస్తున్నారు. రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర తర్వాత జార్ఖండ్‌లో బీజేపీని అధికారానికి దూరంగా ఉంచాలని ప్రజలు నిర్ణయించారని శరద్ పవార్ వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories