ఝార్ఖండ్‌లో జేఎంఎం కూటమిదే విజయం.. ఓడిపోయిన సీఎం, పలువురు మంత్రులు

ఝార్ఖండ్‌లో జేఎంఎం కూటమిదే విజయం.. ఓడిపోయిన సీఎం, పలువురు మంత్రులు
x
హేమంత్‌ సోరెన్‌
Highlights

బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఝార్ఖండ్ ఎన్నికల్లో ఘోర పరాజయంతో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ జేఎంఎం -...

బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఝార్ఖండ్ ఎన్నికల్లో ఘోర పరాజయంతో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ జేఎంఎం - కాంగ్రెస్ - ఆర్జేడీ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 81 స్థానాలకు గాను జేఎంఎం కూటమి మెజార్టీకి అవసరమైన స్థానాల కంటే 6 సీట్లను అధికంగా గెలుచుకుని అధికార పీటాన్ని దక్కించుకుంది. దీంతో బీజేపీ మరో రాష్ట్రాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

బీజేపీ మరో రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. అందరి అంచనాలు తలకిందులు చేసి జార్ఖండ్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. జేఎంఎం - కాంగ్రెస్ - ఆర్జేడీ కూటమి ఘన విజయం సాధించింది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తోసి రాజని ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజార్టీ సాధించింది. రాష్ట్రంలో మొత్తం 81 స్థానాలకు గాను ఈ కూటమి 47 స్థానాల్లో విజయం సాధించింది. అధికార బీజేపీ కేవలం 25 స్థానాలకే పరిమితమైంది. ఓటమి అనంతరం ముఖ్యమంత్రి పదవికి రఘుబర్ దాస్ రాజీనామా చేశారు.

సాక్షాత్తూ సీఎం రఘుబర్ దాస్ ఓడిపోవడం బీజేపీ పరాభవానికి అద్దం పడుతోంది. ఇక జేవీఎం 2, ఏజేఎస్‌యూ 2, ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందారు. జార్ఖండ్ అసెంబ్లీ మ్యాజిక్ ఫిగర్ 41 కాగా జేఎంఎం కూటమి మెజారిటీకి అవసరమైన స్థానాల కంటే 6 సీట్లను అధికంగా గెలుచుకుంది. జేఎంఎం వర్కింగ్ ప్రెసిడెంట్, సీఎం అభ్యర్థి హేమంత్‌ సోరెన్‌ తాను పోటీ చేసిన రెండు చోట్లా విజయం సాధించారు.

ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి గత ఎన్నికల వరకు ఏజేఎస్‌యూతో కలిసి కూటమిగా పోటీ చేసిన కాషాయం పార్టీ ఈసారి సీట్ల పంపకాల విషయంలో పొరపొచ్చాల కారణంగా ఒంటరిగా బరిలో దిగింది. ఇదే సమయంలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిగా పోటీ చేయడం కలిసొచ్చింది. ఈ పార్టీలు వరసగా 43, 31, 7 స్థానాల్లో పోటీ చేశాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories