ఉపవాస దీక్ష చేసింది.. ప్రాణాలు కోల్పోయింది

ఉపవాస దీక్ష చేసింది.. ప్రాణాలు కోల్పోయింది
x
Highlights

సంప్రదాయం కోసం ఉపవాస దీక్ష చేసిన ఓ యువతి చివరికి తన ప్రాణాలు కోల్పోవల్సి వచ్చింది. ఈ ఘటన గుజరాత్‌లోని కచ్‌లో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే.. జైన ఆచారాల ప్రకారం ఎనిమిది రోజుల ఉపవాసం తర్వాత ఏక్తా అశుభాయ్ గాలా అనే 25 ఏళ్ల జైన మహిళ బుధవారం మరణించింది.

సంప్రదాయం కోసం ఉపవాస దీక్ష చేసిన ఓ యువతి చివరికి తన ప్రాణాలు కోల్పోవల్సి వచ్చింది. ఈ ఘటన గుజరాత్‌లోని కచ్‌లో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే.. జైన ఆచారాల ప్రకారం ఎనిమిది రోజుల ఉపవాసం తర్వాత ఏక్తా అశుభాయ్ గాలా అనే 25 ఏళ్ల జైన మహిళ బుధవారం మరణించింది. ఏక్తా ఉపవాసదీక్ష కోసం గుజరాత్‌లోని కచ్‌లో నెల కిందట పుట్టింటికి చేరుకున్నారు. ఐదు రోజుల తరువాత ఏక్తా అశుభాయ్ గాలా ఆరోగ్యంతో కచ్‌లోని స్థానిక ఆసుపత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన డాక్టర్‌ దీక్షను విరమించి రోజుకు ఒకసారైనా ఆహారం తీసుకోవాలని సూచించగా ఏక్తా నిరాకరించారు. సెప్టెంబర్‌ 3న ఏక్తా ఆరోగ్య మరింత దిగజారింది. ఆమెకు గ్లూకోజ్‌ ఎక్కించారు.ఏదేమైనా, సెప్టెంబర్ 3 న, ఏక్తా పరిస్థితి మరింత దిగజారింది మరియు ఆమెకు గ్లూకోజ్ ఇవ్వబడింది. జైన విశ్వాసాల ప్రకారం మాత్రం ఉడికించిన నీరు త్రాగడానికి ఆమె అంగీకరించారు. అయితే అదే రోజు అర్థరాత్రి, ఆమెకు గుండెపోటు వచ్చి వెంటనే కన్నుమూశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories