ISRO: అంతరిక్షంలోకి మహిళా రోబో!

ISRO: అంతరిక్షంలోకి మహిళా రోబో!
x
Highlights

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇటీవల జీశాట్-30 ఉపగ్రహాన్ని ప్రయోగించి విజయవంతంగా నింగిలోకి పంపించింది.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇటీవల జీశాట్-30 ఉపగ్రహాన్ని ప్రయోగించి విజయవంతంగా నింగిలోకి పంపించింది. ఇప్పుడు అదే తరహాలో మరో ప్రయోగం చేయడానికి శ్రీకారం చుట్టింది. గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ గగన్‌యాన్‌ ప్రాజెక్టుపై ప్రకటన చేసిన విషయం అందరికీ తెసిందే. ఈ ప్రకటనకు అనుగుణంగానే ఇస్రో పావులను కదుపుతుంది. ఏది ఏమైనా 2022 నాటికి అంతరిక్షంలోని మానవులను పంపే 'గగన్‌యాన్‌' ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందని ఇస్రో ఛైర్మన్‌‌ కె.శివన్‌ ఇటీవల వెల్లడించారు.

ఈ ప్రయోగంలో భాగంగా అంతరిక్షంలోకి నలుగురు వ్యోమగాములను పంపిస్తున్నారు. కానీ అందలో అందరూ పురుషులే ఉండడం గమనార్హం. అయితే ఈ బృందంలో మహిళలకు మాత్రం చోటు దక్కక పోవడంతో ఆ లోటును భర్తీచేయడానికి మహిళా రోబోను అందులో పంపనున్నారు.

ఇప్పటికే అంతరిక్ష యాత్రకు పంపించే మహిళా రోబోను తయారు చేసినట్టు తెలుస్తుంది. ఈ రోబోను 'వ్యోమ్‌మిత్రా' అని పిలుస్తారని, అది అన్ని రకాల పనులను చేయగలదని సైంటిస్టులు చెబుతున్నారు. అంతే కాకుండా ఇది రెండు భాషల్లోనూ సంభాషించగలదని చెబుతున్నారు.

గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు రష్యా సహాకారం అందజేస్తోందని. వ్యోమగాములకు తొలుత భారత్‌లో, తర్వాత రష్యాలో శిక్షణ ఇస్తారని తెలిపారు. అంతరిక్షంలోకి పంపించేందుకు ఇప్పటికే నలుగురిని ఇస్రో ఎంపికచేసిందని తెలిపారు. ఇందులో ముగ్గురు వ్యోమగాములు ఉండగా, మరొకని స్ధానాన్ని మహిళా రోబోట్ భర్తీ చేయనుంది. ఇక ఈ గగన్‌యాన్‌ ప్రాజెక్టును అమలు చేయడానికి కేంద్రం ఇప్పటికే రూ.10వేల కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు కోసం భారత్ రష్యా, ఫ్రాన్స్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ప్రయోగం కనుక విజయం సాధిస్తే అంతరిక్షంలోకి మనుషులను పంపిన నాలుగో దేశంగా భారత్‌ కీర్తి గడిస్తుందని చెబుతున్నారు. దీంతో ఇస్రో పేరు ఎంతో గుర్తింపు పొందుతుంది. కాగా ఈ ప్రయోగంలో వ్యోమగాములను అంతరిక్షం నుంచి సురక్షితంగా తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని ఇస్రో ఛైర్మన్ వ్యాఖ్యానించారు. గగన్‌యాన్‌లో భాగంగా ఇస్రో పంపే తొలి వ్యోమనౌకను ఖాళీగా పంపకుండా, వీలైనంత వరకూ సద్వినియోగం చేసుకుంటామని, అందుకు రోబోను వినియోగిస్తామని అన్నారు. ఈ ప్రయోగం విజయం సాధించాలని కోరుకుంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories