Top
logo

హ్యాట్సాప్ ఇస్రో.. మరో ఘనత సాధించిన ఇస్రో..

హ్యాట్సాప్ ఇస్రో.. మరో ఘనత సాధించిన ఇస్రో..
Highlights

అంతరిక్ష పరిశోధనలు, ఖగోళ రహస్యాలే కాదు విశ్వంలో సృష్టికి మరో సృష్టి సఖ్యత చేయగలనంటోంది భారత అంతరిక్ష పరిశోధనా ...

అంతరిక్ష పరిశోధనలు, ఖగోళ రహస్యాలే కాదు విశ్వంలో సృష్టికి మరో సృష్టి సఖ్యత చేయగలనంటోంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. ఇప్పటి వరకు ప్రపంచంలో అమెరికాకే సొంతమంటోన్న చంద్రమండల మట్టిని ఇస్రో తన శాస్త్ర పరిశోధనతో తయారు చేసింది. అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ మట్టిని అమెరికా నుంచి కొనుగోలు చేయాలంటే భారీ వ్యయం అవుతోంది. కానీ ఇస్రో సొంతంగా తయారుచేసింది.

ఇస్రో మరో ఘనత సాధించింది. చంద్రుడిపై ఉండే మాదిరి మట్టిని తయారు చేసి అబ్బురపరిచింది. చంద్రమృత్తికను కృత్రిమంగా తయారు చేసే విధానాన్ని కనుగొన్నందుకు ఇండియన్ పేటెంట్ ఆఫీస్ ఇస్రోకు పెటెంట్‌ను మంజూరు చేసింది. చంద్రుడిపై ఉండే మట్టిని ఇస్రోకు చెందిన ఐ. వేణుగోపాల్, ఎస్‌ఏ కన్నన్, వి చంద్రబాబులతో పాటు పెరియార్ యూనివర్శిటీకి చెందిన ఎస్ అంబజగన్, ఎస్ అరివళగన్, సీఆర్ పరమశివం, ఎం చిన్నముత్తులు కలిసి తయారుచేశారు. వీరితో పాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుచిరాపల్లికి చెందిన కే. ముత్తుకుమరన్ తదితరులు భాగస్వాములయ్యారు.

భారత్ గతంలో తలపెట్టిన చంద్రయాన్‌లో విక్రమ్ మూన్ లాండర్ చంద్రుడిపై దిగే సమయంలో విఫలమైంది. అయినా చంద్రుడిపై కాలు మోపేందుకు భారత్ మరో ప్రయత్నం చేస్తోంది. చంద్రయాన్-2 ప్రయోగాల్లో భాగంగా విక్రమ్ లాండర్, ప్రజ్ఞాన్ రోవర్ మొదలైన వాటిని పరీక్షించేందుకు ఇస్రోకు చంద్రుని మీది ఉండే వాతావరణాన్ని కృత్రిమంగా తయారు చేయాల్సి వచ్చింది. దీనితో పాటు ఇప్పుడు చంద్ర మృత్తిక ఉపయోగపడనుంది. అత్యంత క్లిష్టమైన ఈ చంద్ర మృత్తికను మొదట అమెరికా నుంచి దిగుమతి చేసుకుందామనుకున్నారట కానీ అది చాలా ఖరీదైన వ్యవహారం కావడంతో దేశీయంగానే చంద్రుడి మీద ఉండే మట్టిని తయారు చేశారు భారత శాస్త్రవేత్తలు. హ్యాట్సాప్ ఇస్రో.

Web TitleISRO gets patent for manufacturing 'moon soil'
Next Story