చంద్రయాన్‌-2 సూపర్ సక్సెస్‌..కొత్త చరిత్ర సృష్టించిన భారత్‌

చంద్రయాన్‌-2 సూపర్ సక్సెస్‌..కొత్త చరిత్ర సృష్టించిన భారత్‌
x
Highlights

భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగం సూపర్ సక్సెసైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో...

భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగం సూపర్ సక్సెసైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన GSLV_MK-3 వాహకనౌక క్రయోజనిక్ దశ విజయవంతంగా ముగిసింది. దాంతో రాకెట్‌ నుంచి ఉపగ్రహం విడిపడి కక్ష్యలోకి చేరింది. భూస్థిర కక్ష్యలోకి ఆర్బిటార్‌ చేరడంతో శాస్త్రవేత్తల హర్షం వ్యక్తంచేశారు.

అంతరిక్ష రంగంలో భారత్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. చంద్రయాన్‌-2 సక్సెస్‌తో ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తోంది. అమెరికా, రష్యాలాంటి అగ్రదేశాలు భారత్‌‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నాయి. చంద్రయాన్‌-2 సక్సెస్‌తో మరో అడుగు ముందుకేశారంటూ అభినందించారు.

చంద్రయాన్‌-2 ప్రయోగం సక్సెస్‌ వెనుక షార్‌ శాస్త్రవేత్తలందరి కృషి ఉందని ఇస్రో ఛైర్మన్‌ శివన్ అన్నారు. చంద్రయాన్‌-2తో సరికొత్త చరిత్ర సృష్టించామన్న ఇస్రో ఛైర్మన్‌ ఈ ఏడాది మరిన్ని సంచలన ప్రయోగాలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రకటించారు.

చంద్రయాన్‌-2 క్రయోజనిక్ దశ విజయవంతంగా పూర్తయి ఆర్బిటార్‌ కక్ష్యలోకి చేరిందన్న ఇస్రో ఛైర్మన్‌ రానున్న 45రోజులు అత్యంత కీలకమన్నారు. సెప్టెంబర్ 7 నాటికి ల్యాండ్ రోవర్ చంద్రుడిపైకి దిగుతుందన్నారు. రోవర్ చంద్రుడిపై అడుగుపెట్టి చిత్రాలను పంపడం మొదలుపెట్టిన తర్వాత చంద్రయాన్‌-2 యాత్ర కంప్లీట్‌ అవుతుందని తెలిపారు. చంద్రుడిపై రోవర్ ల్యాండైన తర్వాత 14రోజులపాటు చిత్రాలను పంపనుంది. చంద్రుడి ఉపరితలంపై వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడంతోపాటు నీటి జాడ ఉందో లేదో తెలుసుకునేందుకు సూపర్ క్లారిటీతో పిక్చర్స్‌‌ను పంపనుంది.

చంద్రయాన్‌-2 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ, ఇతర ప్రముఖులు అభినందనలు తెలిపారు. రాజ్యసభలో సభ‌్యులంతా నిలబడి ఇస్రో శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. రాజ్యసభ తరపున ఛైర్మన్‌ వెంకయ్య ఇస్రో టీమ్‌కు అభినందనలు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories