తగిన ఫలితం దక్కింది : ఇస్రో చైర్మన్ శివన్

తగిన ఫలితం దక్కింది : ఇస్రో చైర్మన్ శివన్
x
Highlights

చంద్రయాన్‌-2 మిషన్ విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. శాస్త్రవేత్తలు ఒకరినొకరు పరస్పరం అభినందించుకున్నారు. అయితే...

చంద్రయాన్‌-2 మిషన్ విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. శాస్త్రవేత్తలు ఒకరినొకరు పరస్పరం అభినందించుకున్నారు. అయితే అందరి సమష్టి కృషితోనే చంద్రయాన్‌-2 సక్సెస్ అయ్యిందని ఇస్రో ఛైర్మన్ శివన్ అన్నారు. చంద్రయాన్‌-2 కోసం ఇస్రో టీమ్‌ అహర్నిశలు శ్రమించిందని గుర్తుచేశారు. కక్ష్యలోని మొన్నటి ప్రయోగంలో వచ్చిన సాంకేతిక సమస్యలను అధిగమించామన్నారు. చంద్రయాన్-2 ప్రయోగంతో.. తగిన ఫలితం దక్కినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ ప్రయోగంతో ఇస్రో.. సరికొత్త చరిత్ర సృష్టించిందన్నారు. ఇది ప్రతి భారతీయుడి విజయమని వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories