కార్తీ చిదంబరానికి చిక్కులు తప్పేలా లేవు..

కార్తీ చిదంబరానికి చిక్కులు తప్పేలా లేవు..
x
Highlights

ఐఎన్‌ఎక్స్‌ మీడియా ముడుపుల కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి చిక్కులు తప్పేలా లేవు.. ఈ కేసులో నిందితురాలు, ఇంద్రాణి...

ఐఎన్‌ఎక్స్‌ మీడియా ముడుపుల కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి చిక్కులు తప్పేలా లేవు.. ఈ కేసులో నిందితురాలు, ఇంద్రాణి ముఖర్జియా అప్రూవర్‌గా మారేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆమె ఢిల్లీ కోర్టుకు అప్పీలు చేసుకున్నారు. అయితే ఇంద్రాణి అప్రూవర్‌గా మారేందుకు గల కారణాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు భావిస్తోంది.

ఇదిఅలావుంటే కార్తీ చిదంబరం గురువారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియాలో విదేశీ పెట్టుబడులకు.. ఫారిన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు.. అనుమతులు ఎలా ఇచ్చిందో చెప్పాలని కార్తీ చిదంబరాన్ని ఈడీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్‌ఎక్స్‌ మీడియా వ్యవహారంలో ముడుపులు అందినట్టు ఆరోపణలు వచ్చాయి. 1 మిలియన్‌ డాలర్లు ఇవ్వాలంటూ తన భర్త పీటర్‌ను డిమాండ్‌ చేశారని ఇంద్రాణి పేర్కొన్నారు. ఇక ఈ కేసులో గతేడాది ఫిబ్రవరిలో కార్తీ చిదంబరం అరెస్టైన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories