తెలుగు రాష్ట్రాల్లో ఈ గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు

తెలుగు రాష్ట్రాల్లో ఈ గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు
x
Highlights

అందరికీ వేగవంతమైన ఇంటర్నెట్‌ (బ్రాడ్‌బ్యాండ్‌) సేవలు అందించేందుకు రూ.45,000 కోట్లతో భారత్‌నెట్‌ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ పథకం కింద...

అందరికీ వేగవంతమైన ఇంటర్నెట్‌ (బ్రాడ్‌బ్యాండ్‌) సేవలు అందించేందుకు రూ.45,000 కోట్లతో భారత్‌నెట్‌ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ పథకం కింద ప్రతిగ్రామంలో కనీసం ఒక వైఫై హాట్‌స్పాట్‌ నెలకొల్పాలన్నది లక్ష్యం. ఈ ఏడాది ఆఖరు కల్లా పూర్తికావాల్సిన ఈ ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని గ్రామాలకు అందుబాటులోకి వచ్చిందని కేంద్ర మనోజ్‌ సిన్హా రాజ్యసభలో వెల్లడించారు.

తెలంగాణలో 2,047 పంచాయతీలకు కనెక్టివిటీ అందించామని, 6,578 గ్రామాలకు కల్పించాల్సి ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 1,227 పంచాయతీలకు కనెక్టివిటీ కల్పించామని, 11,671 గ్రామాలకు అందించాల్సి ఉందని వెల్లడించారు. కాగా ప్రస్తుతం దేశంలో 38,000 హాట్‌స్పాట్‌ ప్రాంతాలే ఉన్నాయి. వాణిజ్య సంస్థలు వసూలు చేస్తున్న మొత్తంలో నాలుగోవంతుకే భారత్‌నెట్‌ సేవలు లభించనున్నాయి. ఈ పథకం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే సమయానికి 4జీ సేవలు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. ఈ సదుపాయాన్ని విషయ పరిజ్ఞానంకోసం వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories