యోగాకు సంపన్నులు, పేదలు అనే తేడా లేదు: మోదీ

యోగాకు సంపన్నులు, పేదలు అనే తేడా లేదు: మోదీ
x
Highlights

ప్రపంచమంతా యోగాసనాలు వేస్తోంది. దేశమంతా ధ్యానం, ప్రాణాయామం చేస్తోంది. ఐదో యోగా దినోత్సవ సందర్భంగా జార్ఖండ్ లోని రాంచీలో జరిగిన కార్యక్రమంలో ...

ప్రపంచమంతా యోగాసనాలు వేస్తోంది. దేశమంతా ధ్యానం, ప్రాణాయామం చేస్తోంది. ఐదో యోగా దినోత్సవ సందర్భంగా జార్ఖండ్ లోని రాంచీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మోడీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యోగా ప్రేమికులకు శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు 40వేల మంది యోగా అభ్యాసకులతో మోడీ ఆసనాలు వేశారు. యోగా అంటే కేవలం ఎక్సర్‌సైజులు చేయడం మాత్రమే కాదని ఫిట్‌నెట్, వెల్‌నెస్‌లను కలిగించే మార్గమని మోడీ చెప్పారు. యోగా అనేది జీవితంలో ఓ ఆశను కలిగిస్తుందని శక్తినిధైర్యాన్ని అందిస్తుందని మోడీ తెలిపారు. ప్రధాన మంత్రి జన్‌ ఆరోగ్య యోజన ద్వారా మెరుగైన సేవలు అందిస్తామని అన్నారు. యోగా వల్ల సామాన్యులతో పాటు అందరికీ లబ్ధిచేకూరుతుందని మోడీ అన్నారు. యోగాకు వయస్సు, రంగు, కులం, మతం తేడా లేదు. యోగాకు సంపన్నులు, పేదలు అనే తేడా లేదు యోగా అందరిది అని అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories