చైనా ప్లాన్ ప్రకారమే... ఇంటెలిజెన్స్ రిపోర్టులో ఆసక్తికర విషయాలు

చైనా ప్లాన్ ప్రకారమే... ఇంటెలిజెన్స్ రిపోర్టులో ఆసక్తికర విషయాలు
x
Highlights

సరిహద్దుల్లో గల్వాన్‌ లోయలో చైనా - భారత సైనికుల మధ్య జరిగిన ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన పక్కా పథకం ప్రకారమే జరిగిందని అమెరికా ఇంటెలిజెన్స్‌...

సరిహద్దుల్లో గల్వాన్‌ లోయలో చైనా - భారత సైనికుల మధ్య జరిగిన ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన పక్కా పథకం ప్రకారమే జరిగిందని అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. చైనా దళాలలు భారత భూభాగంలోకి చొచ్చుకురావడం.. ఆ తర్వాత వెనక్కి తగ్గినట్లు నటించడం.. భారత దళాలను రెచ్చగొట్టేలా దాడి చేయడం.. వెనుక ఓ చైనా సీనియర్‌ అధికారి వ్యూహం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలియజేశాయి.

చైనా పశ్చిమ థియేటర్‌ కమాండ్‌ హెడ్‌ జనరల్‌ ఝావో ఝాంగ్‌కీ భారత్‌ సరిహద్దుల వెంట చైనా దళాలు ముందుకు వెళ్లాలని ఆదేశించినట్లు అమెరికా ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం. జనరల్‌ ఝావో ఝాంగ్‌కీ పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీలో సీనియర్‌ కమాండర్‌. ప్రస్తుతం కరోనావైరస్‌ వ్యాప్తి, చైనా దూకుడు కారణంగా అమెరికా , భారత్‌ను తన పక్షాన చేర్చుకుంటుందని జనరల్‌ ఝావో ఝాంగ్‌కీ అంచనా వేశారు.

భారత్‌కు ఓ గట్టి గుణపాఠం చెప్పి ప్రపంచ వ్యాప్తంగా తాను బలంగా ఉన్నట్లు నిరూపించుకోవాలని చైనా భావించిందని, అయితే భారత దళాలు ప్రతిఘటీంచడంతో గల్వాన్‌లో చైనా వ్యూహం బెడిసికొట్టిందని తెలిపింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories