కరోనా ఎఫెక్ట్‌ : ఇన్ఫోసిస్‌ భవనం ఖాళీ

కరోనా ఎఫెక్ట్‌ : ఇన్ఫోసిస్‌ భవనం ఖాళీ
x
Highlights

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ బెంగళూరులోని తన కార్యాలయాన్ని ఖాళీ చేసింది. కంపెనీలో ఒక ఉద్యోగికి కరోనా వచ్చిందని అనుమానంతో బెంగళూరులోని ఇన్ఫోసిస్ కార్యాలయం...

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ బెంగళూరులోని తన కార్యాలయాన్ని ఖాళీ చేసింది. కంపెనీలో ఒక ఉద్యోగికి కరోనా వచ్చిందని అనుమానంతో బెంగళూరులోని ఇన్ఫోసిస్ కార్యాలయం భవనం ఖాళీ చేశారు. ఆ ఉద్యోగికి కరోనా వచ్చిందనే ముందు జాగ్రత్తతోనే మిగతా ఉద్యోగులను అలర్ట్ చేశామని ఇన్ఫోసిస్ అధికారి గురురాజ్ దేశ్‌పాండే తెలిపారు.

కరోనా ఎఫెక్ట్‌ : ఇన్ఫోసిస్‌ భవనం ఖాళీఅయితే ఉద్యోగులు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, అన్ని విధాలుగా తాము సంసిద్ధంగా ఉన్నట్లు తమ ఉద్యోగులను అభ్యర్థించింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు సమాచారాన్ని, వదంతులు నమ్మవద్దని తమ ఉద్యోగులకు సూచించింది. ఉద్యోగులు అత్యవసర పరిస్థితుల్లో తమ కంపెనీ గ్లోబల్‌ హెల్ప్‌ డెస్క్‌ను సంప్రదించి సమాచారం పొందవచ్చనని పేర్కొంది. కరోనా వైరస్‌ నుంచి దూరంగా ఉండడానికి ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోవ్‌ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం అన్ని ఐటీ, బయోటెక్‌ కంపెనీలకు ఆదేశించిన నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ ఈ నిర్ణయం తీసుకుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories