భారతరైల్వే శాఖ కీలక నిర్ణయం

భారతరైల్వే శాఖ కీలక నిర్ణయం
x
Highlights

భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దేశంలో పలు ప్రధాన రైల్వే స్టేషన్ నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించింది....

భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దేశంలో పలు ప్రధాన రైల్వే స్టేషన్ నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలుత సికింద్రబాద్ రైల్వే స్టేషన్‌ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయానికి వచ్చింది. ఇదే జరిగితే ప్రయాణికులపై తీవ్ర భారం పడనుంది. ఫ్లాట్ ఫామ్ టిక్కెట్ ధరలు భారీగా పెరగడంతో పాటు పార్కింగ్ ఫీజులు కూడా పెరగనున్నాయి. ఈనిర్ణయాన్ని రైల్వే కార్మిక, ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

దేశంలో ప్రధాన రైల్వే స్టేషన్‌ల నిర్వహణతో పాటు ప్లాట్ ఫామ్ టిక్కెట్ల విక్రయం, పారిశుద్ద్య నిర్వహణ, పార్కింగ్ వంటి సేవలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్వహణను ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చేతికి అప్పగించడం జరిగింది. దీంతో పాటు జోన్లలో ఉన్న మరికొన్ని రైల్వే స్టేషన్‌లుకూడా ఐఆర్ఎస్డీసి కి అప్పగించాలని భావిస్తోంది. ప్రధాన రైల్వే స్టేషన్ల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల ప్లాట్ ఫాం టిక్కేట్‌ల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగాల సంఖ్య గణనియంగా తగ్గిపోనుంది. దీంతో శాశ్వత కార్మికులపై అమితమైన భారం పడనుంది. దీంతో రైల్వే కార్మికులు రైల్వేశాఖ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

రైల్వేలు బ్రిటిష్ కాలం నుండి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. దీనిని ఇప్పటి ప్రభుత్వాలు నిర్వీర్యం చేయాలని చూస్తున్నాయని.. సౌత్ ఇండియా రైల్వే మాజ్ధుర్ యూనియన్ కార్యదర్శి శంకర్ రావు తీవ్రంగా వ్యతిరేకించారు. రైల్వేలను ప్రవేటికరిస్తే చాలా వరకు ఉద్యోగులను తగ్గించే అవకాశం ఉంటుందని ,స్టేషన్ల నిర్వహణ పేరుతో ప్రయాణికుల నుండి దోపిడీ చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

రైల్వేలను ప్రయివేటు చేయడం ద్వారా రైల్వే భూములను ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని చూస్తోందని రైల్వే ప్రయాణికుల కార్యదర్శి నూర్ ఆరోపించారు. స్టేషన్లను నిర్వహణ పేరుతో ప్రయివేటికరణ చేయడం వల్ల ప్రయాణికులపై ఫ్లాట్ ఫామ్ టిక్కెట్లతో పాటు పార్కింగ్ ఫీజుల భారం పడనుందని నూర్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రైల్వే ల ప్రవేటికరణ నిలిపివేయాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ ,ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లను ప్రవేటికరణ చేసి మూత పడే స్థితికి తెచ్చారని.. రైల్వేలను కూడా అలాగే చేసి సామాన్యులకు దూరం చేయవద్దని నూర్ కోరారు. రైల్వేల ప్రవేటీకరణ వల్ల సామాన్యులపై పెను భారం పడనుంది. రైల్వేల నిర్వహణ పేరుతో రైల్వేలను కార్పోరేట్ శక్తులకు అప్పగించేలా యత్నాలు సాగుతున్నాయని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories