గుండ్రటి బొట్టు.. ఆకట్టుకునే చీరకట్టు: ఇండియన్ పాలిటిక్స్‌కు సుష్మా ఐకాన్

గుండ్రటి బొట్టు.. ఆకట్టుకునే చీరకట్టు: ఇండియన్ పాలిటిక్స్‌కు సుష్మా ఐకాన్
x
Highlights

గుండ్రటి బొట్టు... ఆకట్టుకునే చీరకట్టు... నుదిటిపై కుంకుమ... సంప్రాదాయ భారతీయ మహిళకు ప్రతిరూపంలా ఉండే సుష్మాస్వరాజ్‌ స్టైలే వేరు. వేదిక ఏదైనా ఆమె...

గుండ్రటి బొట్టు... ఆకట్టుకునే చీరకట్టు... నుదిటిపై కుంకుమ... సంప్రాదాయ భారతీయ మహిళకు ప్రతిరూపంలా ఉండే సుష్మాస్వరాజ్‌ స్టైలే వేరు. వేదిక ఏదైనా ఆమె కట్టూబొట్టూ భారత సంస్కృతిని ప్రతిబింబించేది. అంతేకాదు విషయ పరిజ్ఞానం, వాక్ చాతుర్యం ఆమె సొంతం. అందుకే అమె మాట్లాడుతుంటే ఎవరైనాసరే పిన్ డ్రాప్ సెలైన్స్‌‌గా వినాల్సిందే. ఇండియన్ పాలిటిక్స్‌కే ఐకాన్‌‌లాంటి సుష్మాపై కట్టూబొట్టుపై ప్రత్యేక కథనం.

దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించిన మహిళల్లో సుష్మాస్వరాజ్ ఒకరు. బీజేపీ జాతీయ నాయకుల్లో అత్యంత కీలక పాత్ర పోషించిన ఏకైక మహిళ కూడా సుష్మానే. కమల దళంలో మహామహుల్ని తలదన్ని కీలక పదవులను అధిష్టించిన సుష్మాస్వరాజ్‌ పార్టీలో క్రియాశీల పాత్ర పోషించి. దేశంలోనే అగ్రనాయకురాలిగా ఎదిగారు. 15వ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా, బీజేపీ పార్లమెంటరీ నాయకురాలిగా సుష్మా పోషించిన పాత్ర అసమాన్యమైనంది. తన వాగ్దాటితో ప్రత్యర్ధులకు ముచ్చెమటలు పట్టించేవారు. అందుకే ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగినా, కుంభకోణాలపై నిలదీసినా... సుష్మా ప్రతీ అడుగూ మాటా సంచలనమే అయ్యేది.

నుదుటిపై గుండ్రటి బొట్టు... ఆకట్టుకునే చీరకట్టుతో భారతీయ మహిళకు ప్రతిరూపంలా ఉండే సుష్మాస్వరాజ్‌ స్టైలే వేరు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంలా కనిపించే సుష్మా... ఇంగ్లీష్, హిందీ అనర్గళంగా మాట్లాడేవారు. పార్లమెంట్‌ అయినా, అంతర్జాతీయ వేదికలైనా, చివరికి గల్లీల్లో సభల్లోనైనా సుష్మా మాట్లాడుతున్నారంటే చెవులప్పగించి వినాల్సిందే. అంతటి విషయ పరిజ్ఞానం, వాక్ చాతుర్యం ఆమె సొంతం. అందుకే సుష్మాస్వరాజ్ మాట్లాడుతుంటే అంతా పిన్‌‌ డ్రాప్‌ సెలైన్స్ అయ్యేవారు. ఏం మాట్లాడతారోనంటూ శ్రద్ధగా వినేవారు. లోక్‌సభలో సుష్మా మాట్లాడుతున్నారంటే... పార్టీలతో సంబంధం లేకుండా, ప్రతి ఒక్కరూ అటెన్షన్‌లోకి వచ్చేసేవారు. భారత దేశ రాజకీయాల్లో అగ్ర నాయకురాలిగా ఎదిగిన సుష్మాస్వరాజ్‌ ఇండియన్ పాలిటిక్స్‌కు ఐకాన్ లాంటివారు. 2014లో బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా మోడీకి దీటుగా సుష్మా పేరు కూడా తెరపైకి వచ్చిందంటే... దేశ రాజకీయాల్లో ఆమె రోల్‌ ఏ స్థాయిలో ఉందో అంచనా వేయొచ్చు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories