Indian Coast Guard 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్‌.. ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ నుంచి జాబ్ నోటిఫికేషన్..

Indian Coast Guard 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్‌.. ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ నుంచి జాబ్ నోటిఫికేషన్..
x

Indian Coast Guard 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్‌.. ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ నుంచి జాబ్ నోటిఫికేషన్..

Highlights

Indian Coast Guard 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్‌.. ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ నుంచి జాబ్ నోటిఫికేషన్..

Indian Coast Guard 2022: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి ఇది గుడ్‌ న్యూస్‌ అని చెప్పవచ్చు. డిగ్రీ అర్హతతో ఇండియన్ కోస్ట్‌గార్డ్‌ జాబ్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైతే నెలకు లక్షకు పైగా జీతం సంపాదించవచ్చు. ఈ కరోనా సమయంలో నిరుద్యోగులు అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే జీవితంలో స్థిరపడవచ్చు. భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వశాఖకి చెదిన ఈ సంస్థ నోయిడాలోని ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయంలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తుంది. ఆ వివరాలేంటో చూద్దాం.

నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 11 ఫోర్‌మెన్ (స్పోర్ట్స్‌) పోస్టులను భర్తీ చేస్తారు. పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎకనామిక్స్‌/కామర్స్‌/స్టాటిస్టిక్స్‌/ బిజినెస్‌ స్టడీస్‌/ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను డైరెక్టర్‌ జనరల్‌, కోస్ట్‌ గార్డ్‌ హెడ్‌క్వార్టర్స్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రిక్రూట్‌మెంట్‌, ఫేజ్‌ 2, ఇండస్ట్రియల్‌ ఏరియా, సెక్టర్‌ 62, నోయిడా, యూనీ 201309 అడ్రస్‌కు పంపించాలి. అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్‌, రాత పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35,400 నుంచి రూ. 1,12,400 వరకు చెల్లిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories