2 వేల నోటు..కథ కంచికేనా?

2 వేల నోటు..కథ కంచికేనా?
x
2 వేల నోటు..కథ కంచికేనా?
Highlights

పెద్ద నోట్లకు సంబంధించిన మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఇకపై ఏటీఎంలో 2వేల నోట్లు రావన్నది సారాంశం. 2 వేలనోట్లను రద్దు చేస్తారా అన్న అనుమానాలు, సందేహాలు...

పెద్ద నోట్లకు సంబంధించిన మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఇకపై ఏటీఎంలో 2వేల నోట్లు రావన్నది సారాంశం. 2 వేలనోట్లను రద్దు చేస్తారా అన్న అనుమానాలు, సందేహాలు చాలాకాలంగా ఉన్నవే. ఇప్పుడు 2వేల నోట్లు ఏటీఎం నుంచి రావన్న వార్తతో మళ్లీ అవే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలలో 2వేల నోట్లను నిలిపివేస్తుందన్న వార్తలు మొదట వచ్చాయి. ఇండియన్ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 3వేల988 ఏటీఎంలు ఉన్నాయి. వాటిలో మార్చి 1 నుంచి కేవలం 500, 200, 100 నోట్లు మాత్రమే లభిస్తున్నాయి.

అయితే ఇది కేవలం కేవలం ఇండియన్ బ్యాంకు మాత్రమే కాదు మిగతా బ్యాంకులు కూడా ఇదే బాటపట్టనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల ఏటీఎంలలో భారీగా మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. 2 వేల నోట్ల స్థానంలో 500 నోట్లను రీప్లేస్ చేయనున్నారని సమాచారం. ఇప్పటికే కొన్ని బ్యాంకులు 2వేల నోట్లు నింపే క్యాసెట్లలో 500 నోట్లు నింపుతున్నాయి.

దేశవ్యాప్తంగా ఉన్న 2లక్షల 40వేలకు పైగా ఏటీఎంలల్లో ఈ మార్పులు జరగనున్నాయి. అన్ని ఏటీఎంలో ఈ మార్పులు పూర్తిగా జరగడానికి ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. ఈ మార్పులు జరిగిన ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తే 500, 200, 100 నోట్లు మాత్రమే పొందగలరు. అయితే ఇప్పటికే మార్కెట్‌లో చలామణిలో ఉన్న 2వేల నోట్లకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. కాకపోతే పెద్ద నోట్లు ఏటీఎంలో లభించవు. పెద్ద నోట్లతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగించడం కోసమే ఈ మార్పులు చేస్తున్నట్టు పలు బ్యాంకులు చెబుతున్నాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories