భారత్ శాంతియుత దేశం కాదా?

భారత్ శాంతియుత దేశం కాదా?
x
Highlights

ప్రపంచానికి శాంతి మంత్రాన్ని ఉపదేశించిన గాంధీజీ పుట్టిన దేశం రోజురోజు కూ అశాంతి మాయం గా మారిపోతోంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియాకు చెందిన ఇన్ స్టిట్యూట్...

ప్రపంచానికి శాంతి మంత్రాన్ని ఉపదేశించిన గాంధీజీ పుట్టిన దేశం రోజురోజు కూ అశాంతి మాయం గా మారిపోతోంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియాకు చెందిన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పీస్ సంస్థ చెబుతోంది. ఈ సంస్థ 2019 సంవత్సరానికి గాను శాంతియుత దేశాల జాబితా రూపొందించింది. ఈ జాబితాలో భారత్ 5 స్థానాలు దిగజారి 141వ స్థానానికి పడిపోయింది. మొత్తం 163 దేశాలతో ఈ జాబితా రూపొందించగా, ఎప్పట్లానే ఐస్ ల్యాండ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. అత్యంత శాంతి నెలకొన్న దేశంగా ఐస్ ల్యాండ్ మరోసారి నంబర్ వన్ ర్యాంకు కైవసం చేసుకుంది. 2008 నుంచి ఈ యూరోపియన్ దేశం పీస్ ఇండెక్స్ లో ప్రథమస్థానం దక్కించుకుంటోంది.

ఇక ఈ జాబితాలో చిట్టచివరన ఆఫ్ఘనిస్థాన్ నిలిచింది. గత ఏడాది ఆఖరి ర్యాంకులో సిరియా ఉండగా, ఇప్పుడు ఆఫ్ఘన్ వచ్చి చేరింది. పొరుగుదేశం పాకిస్థాన్ 153, శ్రీలంక 72, నేపాల్ 76, బంగ్లాదేశ్ 101 ర్యాంకుల్లో నిలిచాయి. చిన్న దేశం భూటాన్ ఈ జాబితాలో 15వ ర్యాంకు దక్కించుకోవడం విశేషం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories