logo

సెల్ఫీ మృతుల్లో భారత్ ఫస్ట్ ..

సెల్ఫీ మృతుల్లో భారత్ ఫస్ట్ ..
Highlights

భారత్ : హద్దు దాటితే ఏదైనా ప్రమాదమే అన్నది వాస్తవం .. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ చేతుల్లో ఉంటే చాలు .. సెల్ఫీ...

భారత్ : హద్దు దాటితే ఏదైనా ప్రమాదమే అన్నది వాస్తవం .. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ చేతుల్లో ఉంటే చాలు .. సెల్ఫీ అంటూ యువత ఫోటోలు దిగడం వాటిని వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం .. ఇది వారికి ఓ వ్యసనంగా మారింది .. ఎక్కడబడితే అక్కడ సెల్ఫీలు దిగుతూ తమ ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారు ..సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు ఒకరు మృతి అని మనం రోజుకు ఒక్క వార్త అయిన చదువుతున్నాం.. ఇలా చనిపోయిన వాళ్ళ సంఖ్యలో మనదేశం మొదటి స్థానంలో ఉంది.. ఇంకా విచిత్రం ఏంటంటే చేపల దాడిలో ప్రాణాలు కోల్పోయిన్ వారి సంఖ్య కంటే సెల్ఫీ దిగి చనిపోయిన వారి సంఖ్యే ఐదు రెట్లు ఎక్కువని భారత్ కి చెందినా ఫ్యామిలీ మెడిసిన్ అండ్ ప్రైమరీ కేర్ జనరల్ పేర్కొంది .. 2011నుండి 2017 మధ్యలో అ సంస్థ చేసిన సర్వేలో 259 మంది చనిపోయారని తెలిపింది .. అందులో 159 మంది భారతీయులే ఉన్నారు . అ తరవాత స్థానంలో రష్యా మరియు usa ఉన్నాయి ..

లైవ్ టీవి

Share it
Top