ప్రైవేటు రైలు.. సౌకర్యాల జోరు!

ప్రైవేటు రైలు.. సౌకర్యాల జోరు!
x
Highlights

రైలు ప్రయాణం అంటే.. ముఖ్యంగా దూరప్రయాణం అంటే ఎంతో బోరు. బస్సులో అయితే చక్కగా టీవీ.. సినిమాలు చూస్తూ కాలక్షేపం చేసే అవకాశం ఉంటుంది. కానీ, రైలులో ఆ...

రైలు ప్రయాణం అంటే.. ముఖ్యంగా దూరప్రయాణం అంటే ఎంతో బోరు. బస్సులో అయితే చక్కగా టీవీ.. సినిమాలు చూస్తూ కాలక్షేపం చేసే అవకాశం ఉంటుంది. కానీ, రైలులో ఆ అవకాశమే లేదు ఇన్నాళ్లూ. ఇపుడు రైలు ప్రయాణం కూడా ఆహ్లాదంగా మారబోతోంది. అందుకు తొలి అడుగు వేస్తున్నట్టు మొన్న బడ్జెట్ లో రైల్వే మంత్రి చెప్పారు. అయితే, ఈ రైలు పూర్తిగా ప్రయివేటు సంస్థ నడుపుతుంది. ఢిల్లీ - లక్నో మధ్య నడిచే తేజస్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రైవేటు సంస్థల అధీనంలో పరుగులు తీయడానికి సిద్ధం అవుతోంది. ఈ రైలు ప్రత్యేకతలు ఇవిగో..

- పూర్తి ఏసీ రైలు ఇది. మొత్తం 23 కోచ్ లు ఉంటాయి.

- ప్రతి సీటు వెనుకా ఎల్సీడీ స్క్రీన్ ఉంటుంది. ఇందులో ఇష్టమైన సినిమాలను, టీవీ కార్యక్రమాలను చూసే వెసులుబాటూ ఉంటుంది.

- ప్రతి సీటుకూ వైఫై, మొబైల్ చార్జింగ్ పాయింట్లూ అందుబాటులో ఉంటాయి.

- రైలు రంగుకు మ్యాచ్ అయ్యేలా, పసుపు ఆరెంజ్ రంగుల్లో ఉండే సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయట.

- ప్రతి కోచ్ కు చిన్న పాంట్రీ ఉంటుంది. ఎల్ఈడీ లైట్లు, మాడ్యులార్ టాయిలెట్ లు దీని ప్రత్యేకత.

- విండోస్ మోటార్ ఆపరేషన్ తో స్మార్ట్గా ఉంటాయి.

- కోచ్ లకు ఆటోమేటిక్ తలుపులు ఉంటాయి.

ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ రైలు ఇప్పటికే ఆనంద్ నగర్ స్టేషన్లో ఉంది. దీనిని ప్రయివేట్ లో నడపాలని తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు బిడ్డింగ్ నిర్వహించడానికి అధికారులు సిద్ధం అవుతున్నారు. బిడ్డింగ్ ద్వారా కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ ఈ రైలు నడుపుతుంది. రైల్వేలను ప్రైవేటీకరించాలన్న ఆలోచనలో కేంద్రం ఉందని, అందులో భాగంగానే ఈ పని చేస్తోందని విపక్షాలు విమర్శిస్తుంటే, ఆ శాఖ మంత్రి పీయుష్ గోయల్ సమాధానం ఇస్తూ, రైల్వేల ప్రైవేటీకరణ ప్రతిపాదనలు ఇంతవరకూ లేవని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories