రెండు దేశాల సంబరాల్లో ఎంత తేడా?

రెండు దేశాల సంబరాల్లో ఎంత తేడా?
x
Highlights

రెండు దాయాది దేశాలు. వారిద్దరూ దేశ ప్రధానులే.. కానీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ప్రసంగంలో ఎంత తేడా? ఒకరు దేశాభివృద్ధిని కాంక్షిస్తూ ప్రసంగిస్తే.. మరొకరు సమయమంతా పొరుగు దేశాన్ని శాపనార్ధాలు పెట్టేందుకే కేటాయించారు.

రెండు దాయాది దేశాలు. వారిద్దరూ దేశ ప్రధానులే.. కానీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ప్రసంగంలో ఎంత తేడా? ఒకరు దేశాభివృద్ధిని కాంక్షిస్తూ ప్రసంగిస్తే.. మరొకరు సమయమంతా పొరుగు దేశాన్ని శాపనార్ధాలు పెట్టేందుకే కేటాయించారు. ఒకరి ప్రసంగం పాజిటివ్ గా ఆలోచింప చేసేదిగా ఉంటే మరొకరి ప్రసంగం మాత్రం అసహనం, అసూయ, ద్వేషం వెళ్లగక్కింది.. ఆ ఇద్దరే మోడీ, ఇమ్రాన్..ఇంతకీ ఎవరేమన్నారు? ఇప్పుడు చూద్దాం.

73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశాలు దాయాది దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. జమ్మూ కశ్మీర్ పూర్తిగా విలీనం అయ్యాక ఎంతో సంబరంగా మనదేశం స్వతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటే..పాకిస్థాన్ మాత్రం తన బుద్ధి పోనిచ్చుకుంది కాదు.. సరిహద్దుల్లో ఇవాళ కూడా కవ్వింపు కాల్పులకు పాల్పడింది. ఇరు దేశాల నేతల ఆలోచనలు, అభిప్రాయాలు, చేతలను ప్రతిబింబిచే విధంగానే స్వాతంత్ర దినోత్సవ ప్రసంగాలు సాగాయి.

భారత, పాకిస్థాన్ దేశాల ప్రధానులు చేసిన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం సహస్రాంతం తేడా ఉంది.. ప్రధాని మోడీ తన సందేశంలో పూర్తిగా దేశాభివృద్ధి, ప్రజల స్థితిగతులు, చేయాల్సిన పనులు, చేరుకోవాల్సిన లక్ష్యల గురించి మాట్లాడగా.. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ మాత్రం అందుకు పూర్తి విరుద్ధం.. భారత్ పై విషం కక్కారు. పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ప్రసంగంలో బీజేపీ, ఆరెస్సెస్ లను తిట్టడానికే తన 40 నిమిషాల సమయాన్ని వెచ్చించారు.. అందుకు మోడీ ప్రసంగం అందుకు విరుద్ధంగా సాగింది.. తన స్పీచ్ లో పాకిస్థాన్ను ఆయన పల్లెత్తు మాట అనలేదు.

ఇమ్రాన్ ఖాన్ పాక్ ఇండిపెండెన్స్ డేను కశ్మీర్ సౌభ్రాతృత్వ దినోత్సవంగా ప్రకటించారు.. కశ్మీర్ ప్రజలకు అండగా ఉంటామని, వారికి వెన్నుదన్నుగా నిలుస్తామని ప్రకటించారు. కశ్మీర్ ను భారత్ అక్రమంగా ఆక్రమించుకుందంటూ మండిపడ్డారు.. ఆర్టికల్ 370 రద్దుపై శివాలెత్తిన ఇమ్రాన్ ఆక్రమిత కశ్మీర్ర్ పై భారత్ ఆలోచనలు వేరుగా ఉన్నాయని, భవిష్యత్తులో ఈ విద్వేష రాజకీయాలు కశ్మీర్ తో ఆగవని, పాకిస్థాన్ వరకూ విస్తరిస్తాయనీ ఆరోపించారు..

మోడీ మాత్రం అందుకు విరుద్ధంగా ప్రతీ ఒక్క భారతీయుడి ఆశలను నెరవేరుస్తానన్నారు.92 నిమిషాలు మాట్లాడిన మోడీ జల జీవన్ పథకంపైనా, ఇతర ప్రభుత్వ పథకాలపైనా వివరణ ఇచ్చారు.. కానీ ఇమ్రాన్42 నిమిషాల ప్రసంగం మాత్రం ఆరెస్సెస్ గుండాగిరీ చేస్తోందని, జడ్జిలు,మేధావులు, సామాజిక కార్యకర్తలను బెదిరిస్తోందనీ మండి పడ్డారు.. నాజీల పాలనను తలపించే విధంగా మోడీ పాలన ఉందన్నారు. మోడీ తన ప్రసంగంలో నయాభారతాన్ని ఆవిష్కరించారు.. అయిదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ పైనా , డిజిటల్ పేమెంట్లపైనా, ప్లాస్టిక్ వస్తువుల నిషేధంపైనా మాట్లాడితే.. పొరుగు దేశాన్ని తిట్టడానికే ఇమ్రాన్ తన సమయాన్ని వెచ్చించారు.

ఆర్టికల్ 370 రద్దుకు ముందు జమ్మూ కశ్మీర్ లో అవినీతి, బంధుప్రీతి పెరిగిపోయిందని తమ ప్రభుత్వ తాజా నిర్ణయంతో జమ్మూ ప్రజలు సంతోషిస్తున్నారని మోడీ ప్రకటించారు. ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి అన్ని దేశాలు కలసి రావాలని, ఉగ్రవాదులకు ఊతమిచ్చే దేశాలను ఎండగట్టాలనీ మోడీ కోరారు. మరోవైపు ఇమ్రాన్ మాత్రం భారత్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని బ్లాక్ డేగా ప్రకటించారు.. తమ ట్విట్టర్ ఎక్కౌంట్ లో ఇమేజ్ ను బ్లాక్ చేసి మరీ తన వ్యతిరేకతను చాటుకున్నారు.అవడానికి దాయాది దేశాలే అయినా రెండు దేశాల మధ్య ఎంత తేడా?

Show Full Article
Print Article
More On
Next Story
More Stories