కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లిధరలు

కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లిధరలు
x
Highlights

ప్రస్తుత రోజుల్లో మార్కెట్ లో ఏం కొందామన్నా, ఏం తిందామన్నా కొనేటట్టు లేదు. నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బులతో నెలకు సరిసడా సరుకులు కూడా రావడంలేదంటే ఆలోచించండి

ప్రస్తుత రోజుల్లో మార్కెట్ లో ఏం కొందామన్నా, ఏం తిందామన్నా కొనేటట్టు లేదు. నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బులతో నెలకు సరిసడా సరుకులు కూడా రావడంలేదంటే ఆలోచించండి నిత్యావసర వస్తవుల ధరలు ఎంతెంత పెరిగిపోతున్నాయో. ముఖ్యంగా వంటగదిలో ఎక్కువగా వాడే ఉల్లి ధర రోజు రోజుకూ కొండెక్కుతుంది. ఉల్లిని కోస్తే కాదు ఇప్పుడు చూస్తేనే కళ్లలోనుంచి నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. ఉల్లిని కొనాలంటే చాలు ఉలిక్కి పడుతున్నారు జనాలు.

ఒకప్పుడు ఉల్లిధర రూ.5 గానో, 10గానో ఉండేది. మరికొంత కాలానికి రూ.20, నుంచి రూ.50 పెరిగింది. ఇప్పుడు మాత్రం ఉల్లిధర అమాంతం పెరిగిపోయింది. దీంతో మధ్య తరగతి కుటుంబాలు ఉల్లిని కొనలేకపోతున్నారు. ఉల్లి ధరలు నియంత్రించడానికి ప్రభుత్వాలు ఉల్లిని వేరే దేశాలకు ఎగుమతులు చేయడంపై నిషేధం విధించింది. అయినా వాటి ధరలో ఎలాంటి మార్పులు రావడంలేదు. ఇటీవల మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు ఉల్లి సాగు ఆగిపోయింది. దీంతో ఉల్లిధర కొండెక్కింది.

నిన్నా, మొన్నటి వరకు ఉల్లి ధర రూ.80 ఉన్న విషయం తెలిసిందే, కాని ఇప్పుడు మాత్రం కొన్ని రాష్ట్రాల్లో అమాంతం రూ.100కు పెరిగింది. ఇక యూపీలో ఉల్లిధరలు రూ. 70 నుంచి 80 వరకు పలుకుతోంది. గతంలో తెలుగు రాష్ట్రాల్లో కిలో కేవలం రూ.20 లోపు ఉన్న ధర గత ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో మాత్రం హైదరాబాద్‌లో రూ. 80లకు పలికింది. దీంతో ప్రభుత్వం స్వయంగా మార్కెట్ లో కొన్ని కౌంటర్లను ఏర్పటు చేసి ఉల్లిని సబ్సీడీ ధరలకు విక్రయించిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం మాత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 40 నుంచి 50 మధ్యలో కొనసాగుతోంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories