దేశ ప్రజలకు విజ్ఞప్తి.. ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి..

దేశ ప్రజలకు విజ్ఞప్తి.. ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి..
x
కిషన్‌రెడ్డి
Highlights

దిశ ఉదంతం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని రగిల్చిన వేళ, పార్లమెంట్ లో మహిళల రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా...

దిశ ఉదంతం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని రగిల్చిన వేళ, పార్లమెంట్ లో మహిళల రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, "దేశంలోని మహిళలతో పాటు ప్రతి ఒక్కరికీ నేను ఒక్కటే విన్నపం చేస్తున్నాను. ప్రతి ఒక్క మహిళ 112 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌ యాప్‌ను ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి. ఈ నెంబర్‌ను దేశ వ్యాప్తంగా ఎక్కడైనా వాడుకోవచ్చన్నారు. రైల్వే స్టేషన్లలో జీఆర్పీ, రైల్వే పోలీసులు, విమానాశ్రయాల్లో సీఐఎస్‌ఎఫ్‌ పోలీసులు స్పందిస్తారని వివరించారు. 112 హెల్ప్‌లైన్‌ను నిర్వహించేందుకు అన్ని రాష్ట్రాలకు నిధులను కూడా అందించామని కిషన్‌రెడ్డి తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories