Top
logo

భారత వాతావరణ శాఖ హెచ్చరిక..రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు

భారత వాతావరణ శాఖ హెచ్చరిక..రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు
X
Highlights

పశ్చిమ తీరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 5 రోజుల పాటు...

పశ్చిమ తీరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 5 రోజుల పాటు మహారాష్ట్ర, కర్ణాటక, కేరళకు వరద ముప్పు పొంచి ఉందని తాజా ప్రకటనలో పేర్కొంది. దీంతో ఆయా రాష్ట్రాల్లోని ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది.

మహారాష్ట్రలో ఇప్పటికే వరదలు ముంచెత్తుతున్నాయి. పలుచోట్ల భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. అలాగే కర్ణాటకలో ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలో భారీ వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అలాగే ఇప్పటికే వరద ముప్పును ఎదుర్కొంటున్న కేరళలో కూడా 5 రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే 78 మంది వరకు మరణించగా మరో 30 మందికి పైగా ప్రజలు గల్లంతయ్యారు.

Next Story