ఉల్లిధర ఎఫెక్ట్ : ఏకంగా కోటీశ్వరుడు అయిన రైతు

ఉల్లిధర ఎఫెక్ట్ : ఏకంగా కోటీశ్వరుడు అయిన రైతు
x
Onion farmer
Highlights

దేశవ్యాప్తంగా ఉల్లిధర ఎలా ఉందో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. సామాన్యుడు కొనాలంటే ఒక్కటికి రెండు సార్లు

దేశవ్యాప్తంగా ఉల్లిధర ఎలా ఉందో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. సామాన్యుడు కొనాలంటే ఒక్కటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోయ్యకుండానే ఉల్లి సామాన్యుడు చేత కన్నీళ్ళు పెట్టిస్తుంది. దాదాపుగా ఇప్పుడు ఎక్కడ చూసిన ఉల్లిధర రూ.100కు పై మాటే నడుస్తుంది. మరికొన్ని చోట్ల రూ.200గా ఉంది.

వినియోగదారులకి కష్టంగానే ఉన్నప్పటికి రైతులకి మాత్రం ఇలా ఒక సంవ‌త్సరం మంచి లాభాలు రావ‌డం హర్షించదగ్గ విషయం. ఎన్నో ఏళ్ల తరువాత పండించిన పంటకు సరైన ధర లభిస్తోందని తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. పంట కోసం చేసిన అప్పులు ఒక్క ఏడాదిలోనే తీర్చుకున్నామంటూ సంబర పడుతున్నారు.

అందులో భాగంగానే ఉల్లిని పండించిన ఓ రైతు ఏకంగా కోటీశ్వరుడు అయ్యాడు. కర్ణాటకకు చెందిన మల్లికార్జున్‌ అనే రైతు చాలా సంవత్సరాల నుంచి ఉల్లిని పండిస్తున్నాడు. ప్రతిసారి పంట నుంచి అప్పులు మిగిలడమే తప్ప, లాభాలు చూసింది లేదని చెపుతున్నాడు. తనకున్న పది ఎకరాలతో పాటు మరో పది ఎకరాల పొలంను కౌలుకు తీసుకుని ఉల్లిపంటను వేశాడు. కాలం కలిసి రావడం, ఉల్లికి మంచి ధర రావడంతో ఆ రైతు ఇంట లాభాల పంట పండింది.

ఉల్లి ధర పెరిగడంతో కొద్ది కాలంలోనే కోట్ల రూపాయాల లాభాన్ని అర్జించాడు ఈ రైతు. దీనితో ఆ రైతు తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. పంటకు ఇప్పటి వరకు రూ. 15 నుంచి 20 లక్షల పెట్టుబడి పెట్టనని, దాదాపుగా కోటి వరకు లాభం వచ్చినట్టుగా చచెప్పుకొచ్చాడు. దాదాపు వంద మంది కూలీలు ఆయన పొలంలో పనిచేస్తున్నారు. తన పంటలో పండిన ఉల్లిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories