ఫుట్‌పాత్‌పైనే ప్రసవించిన మహిళ

ఫుట్‌పాత్‌పైనే ప్రసవించిన మహిళ
x
Highlights

ఫుట్‌పాత్‌పై ఓ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలో రోడ్డు పక్కనున్న ఫుట్‌పాత్‌పై జరిగింది. జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన...

ఫుట్‌పాత్‌పై ఓ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలో రోడ్డు పక్కనున్న ఫుట్‌పాత్‌పై జరిగింది. జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన దంపతులు బబ్లూ, లక్ష్మి ఉపాధి కోసం ఢిల్లీ వచ్చారు. నైట్‌షెల్టర్లలో చోటు లభించకపోవడంతో రోజు కూలీ పనిచేసే ఆమె భర్త ఇద్దరు పిల్లలు రాత్రి పుట్‌పాత్‌పై నిద్రపోయారు. అయితే గర్భిణిగా ఉన్న లక్ష్మికి రాత్రి సమయంలో పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఆసుపత్రికి వెళ్లేందుకు మార్గం లేక బిడ్డను అక్కడే ప్రసవించింది. విషయం తెలుసుకున్న హోలిస్టిక్‌ డెవలప్‌మెంట్‌ అనే ఎన్జీవోకు చెందిన సునీల్‌కుమార్‌ ఎలీడియా ఆమెను ఆసుపత్రికి తరలించారు.

బిడ్డను ప్రసవించిన 18 గంటల తరువాత కూడా తల్లికి, బిడ్డకు మధ్య ఉండే పేగును కత్తిరించలేదని, దాని వల్ల తల్లికి, బిడ్డకు తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని సునీల్‌కుమార్‌ ఎలీడియా చెప్పారు. ఈ ఘటనపై సునీల్‌కుమార్‌ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. ప్రస్తుతానికి తల్లీ బిడ్డలను షెల్టర్‌ హోమ్‌కు పంపి తరువాత పాలిచ్చే తల్లుల కోసం నడిపే కేంద్రానికి తరలిస్తామని షెల్టర్‌ ఇంప్రూవ్‌మెంట్‌ బోర్డు సభ్యుడు బిపిన్‌ రాయ్‌ చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories