కేరళ ప్రభుత్వానికి కేంద్ర హోం శాఖ సెక్రటరీ ఘాటు లేఖ

కేరళ ప్రభుత్వానికి కేంద్ర హోం శాఖ సెక్రటరీ ఘాటు లేఖ
x
Highlights

క‌రోనా మ‌హమ్మ‌రిని ఆరిక‌ట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మే 3వ‌ర‌కు లాక్ డౌన్ విధించింది. అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ నిబంధ‌న‌లు క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని...

క‌రోనా మ‌హమ్మ‌రిని ఆరిక‌ట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మే 3వ‌ర‌కు లాక్ డౌన్ విధించింది. అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ నిబంధ‌న‌లు క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని ఆదేశించింది. అంతే కాకుండా ఈనెల 20 నుంచి మిన‌హాయింపులు ఉంటాయ‌ని తెలిపింది. అయితే కేర‌ళ ప్ర‌భుత్వం మాత్రం కేంద్ర మార్గ‌ద‌ర్శ‌కాల‌కు విరుద్ధంగా రెస్టారెంట్స్, బుక్ షాప్స్, బస్సు సర్వీస్ లు నడపడం కేంద్ర హోం శాఖ సిరీయ‌స్ గా స్పందించింది.

ఈమేర‌కు కేరళ ప్రభుత్వానికి కేంద్ర హోం శాఖ సెక్రటరీ ఘాటు లేఖ రాశారు. కేంద్ర ప్ర‌భుత్వం రూపొందించిన మార్గ‌ద‌ర్శకాల‌ను తప్పనిసరిగా అమలు చేయాల‌ని హోం సెక్రటరీ లేఖలో పేర్కొన్నారు. కార్లలో ఒక‌రు మాత్ర‌మే ప్ర‌యాణం చేయాలి, కేర‌ళ‌లో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా కారులోని వెనుక సీట్లో ఇద్దరితో ప్రయాణానికి అనుమతులు ఇవ్వడాన్ని కేంద్ర హోం శాఖ తప్పుపట్టంది. తక్షణమే వీటిని రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని, కేంద్రం రూపొందించిన గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు మార్గదర్శకాల వ్య‌తిరేకంగా ఉన్న వాటిని త‌క్ష‌ణమే ర‌ద్దుచేయాల‌ని లేఖ‌లో పేర్కొంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories