చిదంబరం నివాసం వద్ద హైడ్రామా

చిదంబరం నివాసం వద్ద హైడ్రామా
x
Highlights

విదేశీ పెట్టుబడుల అనుమతి కేసులో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఏ క్షణాన్నైనా అరెస్టయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీబీఐ, ఈడీ బ్రుందాలు ఆయన నివాసానికి...

విదేశీ పెట్టుబడుల అనుమతి కేసులో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఏ క్షణాన్నైనా అరెస్టయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీబీఐ, ఈడీ బ్రుందాలు ఆయన నివాసానికి చేరుకున్నాయి. అంతకు ముందు ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేసులోఆరోపణ లెదుర్కొంటున్న మాజీ ఆర్థిక మంత్రి ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు.. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యక్ష మయ్యారు. తానే నేరం చేయలేదని, సీబీఐ, ఈడీ తనపై తప్పుడు కేసులు బనాయించాయని ఆరోపించారు. ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో కనీసం ఎఫ్ ఐఆర్ లో కూడా తన పేరు లేదని, తనపైనా, తన కొడుకు కార్తీపైనా అనవసర ఆరోపణలు చేస్తున్నానన్నారు.

తాను రెండు రోజుల నుంచి లాయర్ల సమక్షంలో ఉన్నానని, చట్టాన్ని గౌరవించే వ్యక్తినని సుప్రీం కోర్టులో తన బెయిల్ పిటిషన్ విచారణకొచ్చే వరకూ అరెస్టు చేయవద్దని కోరారు. మీడియా మీట్ తర్వాత ఆయన అంతే వేగంగా వెళ్లిపోయారు. ఈలోగా చిదంబరంను అరెస్టు చేసేందుకు సీబీఐ అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకోవడంతో హైడ్రామా చోటు చేసుకుంది...అధికారులను పార్టీ కార్యాలయం సిబ్బంది లోపలికి అనుమతించలేదు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్యకర్తలూ పార్టీ ఆఫీస్ కు చేరుకున్నారు. చిదంబరాన్ని అరెస్టు చేస్తే ఒప్పుకునేది లేదంటూ నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరిస్థితి చూస్తుంటే సీబీఐ అధికారులు ఏక్షణాన్నైనా చిదంబరాన్ని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories