బంగారు కమ్మలను మింగిన కోడి..శస్త్ర చికిత్సతో..

బంగారు కమ్మలను మింగిన కోడి..శస్త్ర చికిత్సతో..
x
Highlights

బంగారు కమ్మలను మింగిన ఓ కోడి మృతి చెందిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. అయితే గత శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక వివరాల్లోకి...

బంగారు కమ్మలను మింగిన ఓ కోడి మృతి చెందిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. అయితే గత శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళితే చెన్నై పురసైవాక్కం నెల్‌వాయల్‌లో నివాసం ఉంటున్న శివకుమార్‌కు చాలా ఎండ్ల నుండి సంతానం కావడం లేదు. దీంతో ఏడాది క్రితం ఒక కోడి పిల్లను కొనుక్కొచ్చుకొని దానికి పూంజి అనే నామాకారణం చేసి దానిని అల్లురు ముద్దుగా పెంచుకుంటున్నాడు. శుక్రవారం శివకుమార్‌ అక్క బిడ్డ దీప తలదువ్వుకుంటూ తన బంగారు కమ్మలను తీసి కింద పెట్టింది. అయితే ఆ సమయంలో అక్కడే తిరుగుతున్న ఆ కొడి కమ్మలను లటక్కున్న మింగేసింది.

దీనిని గమనించిన శివకుమార్‌ హుటాహుటినా కోడిని తీసుకుని అన్నానగర్‌లోని ఒక వెటర్నరీ డాక్టర్‌ వద్దకు వెళ్లాడు. కొడి పరిస్థితి డాక్టర్‌కు వివరించాడు. వెంటనే కోడికి ఎక్స్‌రే తీశారు. ఎక్సేరేలో చూస్తే కమ్మలు కోడి ఉదర భాగంలో ఉన్నట్లు గుర్తించాడు. దీంతో కోడికి వెంటనే ఆపరేషన్‌ చేసి కమ్మలను వెలికి తీశాడు. అయితే కమ్మలనైతే బయటకు తీశారు కానీ.. కొడి ఉదరభాగంలో కమ్మలలోని సూది మొన లాంటి భాగం కోడి ఉదరాన్ని తీవ్రంగా గాయపరచడంతో కొద్ది సేపటికే ఆ కొడి మృతిచెందింది. ఎంతో ప్రాణంగా పెంచుకున్న తన కోడి చనిపోవడంతో శివకుమార్ కన్నీరుమున్నీరయ్యాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories