ఆ హెలికాప్టర్ అందుకే కూలిపోయిందా?

భారత్, పాకిస్థాన్ ల మధ్య వాతావరణం ఉద్రిక్తంగా ఉన్న సమయంలో మన దేశపు వాయుసేనకు చెడిన హెలికాప్టర్ ఒకటి జమ్మూ లోని ...
భారత్, పాకిస్థాన్ ల మధ్య వాతావరణం ఉద్రిక్తంగా ఉన్న సమయంలో మన దేశపు వాయుసేనకు చెడిన హెలికాప్టర్ ఒకటి జమ్మూ లోని బుద్గాం వద్ద కూలిపోయింది. అందులో ఉన్న ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఫిబ్రవరి 27 న చోటుచేసుకుంది. అపుడు హెలికాప్టర్ సాంకేతిక లోపాలతో కూలిపోయిందని అనుకున్నారు. అయితే దీనిపై వాయుసేన కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీని ప్రారంభించింది. ఆ ఎంక్వయిరీలో హెలికాప్టర్ కూలిపోవడానికి కారణం మన రక్షణ వ్యవస్థలే అని తెలిసింది. ఈ విషయమై ఓ ఆంగ్ల పత్రికలో తాజాగా ఓ కథనం వచ్చింది. ఘర్షణ పూరిత వాతావరణ పరిస్థితుల్లో గగనతలంలోకి ఎగిరిన ఈ హెలికాప్టర్ ను పొరపాటున మన రక్షణ వ్య్వస్తలే కూల్చేసినట్టు ఆ కథనంలో పేర్కొన్నారు.
అందుకే కూల్చేశారా?
ఎంఐ-17 హెలికాప్టర్ బుద్గాం వద్ద మారుమూల ప్రదేశంలో కుప్పకూలిన ప్రదేశం నుంచి అతి ముఖ్యమైన బ్లాక్ బాక్స్(ఫ్లైట్ డేటా రికార్డర్) అదృశ్యమైంది. అందువల్ల ఈ ప్రమాదంపై విచారణలో జాప్యం జరిగింది. దీంతో కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీలో అక్కడి పరిస్థితుల ఆధారంగా విచారణ మొదలుపెట్టారు. ఇక్కడో ప్రమాదకర విషయం వెల్లడైంది. వాయుసేకు చెందిన హెలికాప్టర్‌ను వాయుసేనకు చెందిన గగనతల రక్షణ వ్యవస్థలైన పైథాన్ , డెర్బే, స్పైడర్‌లలో ఏదో ఒకటి పొరబాటున కూల్చేసి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. విధుల్లో ఉన్న పలువురు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇది చోటు చేసుకొందని భావిస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో కీలకమై హెలికాప్టర్‌లోని ఐఎఫ్‌ఎఫ్ వ్యవస్థను స్విచ్చాఫ్ చేసి ఉంచారు. ఒక పక్క సరిహద్దుల్లో వైమానిక ఘర్షణ జరుగుతుంటే ఈ వ్యవస్థను ఎందుకు స్విచ్చాఫ్ చేశారో తెలియటంలేదు. దీంతో గగనతల రక్షణ వ్యవస్థలు ఈ హెలికాప్టర్లను శత్రువర్గానికి చెందినదిగా భావించి పేల్చివేశాయి. హెలికాప్టర్ గాల్లోకి లేచిన తర్వాత వెంటనే దానిని వెనక్కి రమ్మని పిలిచారు. ఈ క్రమంలో గగనతల రక్షణ వ్యవస్థ పరిధిలోకి వెళ్లకుండా సురక్షితంగా వచ్చే మార్గాన్ని మాత్రం సూచించలేదన్న విషయం కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీలో తేలింది.
వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్న సీఎల్పీ బృందం
16 Aug 2022 4:06 AM GMTHar Ghar Tiranga: జాతీయ జెండాను ఎలా భద్రపరచాలి..
15 Aug 2022 11:55 AM GMTBandi Sanjay: డీజీపీకి డెడ్‌లైన్ విధించిన బండి సంజయ్
15 Aug 2022 9:19 AM GMTతెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కే.కేశవరావు
15 Aug 2022 8:15 AM GMTగోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
15 Aug 2022 6:33 AM GMTచిరంజీవి బ్లడ్ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 6:17 AM GMTమంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 4:49 AM GMT
సూర్యుడి ఏజ్‌ను నిర్ధారించిన యురోపియన్ స్పేస్ ఏజెన్నీ..
16 Aug 2022 4:15 PM GMTబాలీవుడ్‌పై బాయ్‌కాట్ పడగ.. టాప్ హీరోలు చేసిన తప్పేంటి?
16 Aug 2022 4:00 PM GMTకొత్త స్టార్టప్ సంస్థను అనౌన్స్ చేసిన రతన్‌టాటా.. సీనియర్ సిటిజన్స్...
16 Aug 2022 3:45 PM GMTరైతులకి పెద్ద ఉపశమనం.. వారికి 4000 రూపాయలు..!
16 Aug 2022 3:30 PM GMTAsaduddin Owaisi: ఆర్టికల్ 370 రద్దు చేసి ఏం సాధించారు? కశ్మీర్లో...
16 Aug 2022 3:15 PM GMT