ఈశాన్య భారత దేశంలో భారీ వర్షాలు

ఈశాన్య భారత దేశంలో భారీ వర్షాలు
x
Highlights

భారీ వర్షాలతో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. బ్రహ్మపుత్ర నది వరద బీభత్సానికి అసోంలోని 21 జిల్లాల పరిధిలో భారీ వరదలకు.....

భారీ వర్షాలతో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. బ్రహ్మపుత్ర నది వరద బీభత్సానికి అసోంలోని 21 జిల్లాల పరిధిలో భారీ వరదలకు.. దాదాపు 15లక్షల మంది నిరాశ్రయులయ్యారు. బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. భారీ వరదల కారణంగా ఇప్పటి వరకూ 7 మృతి చెందినట్లు తెలుస్తోంది..

అస్సాంలో భారీ వర్షాల కారణంగా బ్రహ్మపుత్ర నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రస్తుతం బ్రహ్మపుత్ర ఉధృతిని కళ్లకు కడుతోంది. మోరిగాన్ జిల్లాలోని ఓ స్కూల్ భవనం కూలిపోతున్న దృశ్యాలు ఇందులో కనిపిస్తున్నాయి. తెంగగూరి ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాలగా చెబుతున్న భవనం శనివారం అందరూ చూస్తుండగానే సెకన్ల వ్యవధిలో కూలిపోయింది. పాఠశాలలకు ఇప్పటికే సెలవులు ప్రకటించడంతో పెను ప్రమాదం తప్పింది.

అస్సాం ప్రఖ్యాత కజిరంగ జాతీయ పార్కునూ వరద జలాలు ముంచెత్తాయి. పార్క్‌ భూభాగంలో 70శాతం మేర నీరు నిలిచిపోయింది. దీంతో అక్కడి జంతువులను ఎత్తైన ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మరో ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ పలుచోట్ల కొండ చరియలు విరిగిపడటంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. శనివారం పరిస్థితిని సమీక్షించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

బిహార్‌లోనూ వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల ధాటికి కిషన్‌గంజ్‌ జిల్లాలో ఇద్దరు చిన్నారులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గత 24 గంటల్లో తూర్పు చంపారన్ జిల్లాలో 214.92 మి.మీ, సీతామఢిలో 154.55 మి.మీ, ముజఫర్‌పూర్‌లో 125.15మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు కనీస వసతులు కల్పించేందకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories