ముంబై మునిగింది!

ముంబై మునిగింది!
x
Highlights

ముంబైని.. భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత 5 రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో.. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఇప్పటివరకు 37 మంది...

ముంబైని.. భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత 5 రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో.. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఇప్పటివరకు 37 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు వంద మందికి పైగా గాయాలపాలయ్యారు. చాలా ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్లోకి వరదనీరు వచ్చి చేరింది. దీంతో రోజుల తరబడి వర్షం నీటిలోనే ఉండాల్సి వస్తోంది. ఇటు విద్యుత్‌ సరఫరా లేక చీకట్లోనే మగ్గుతున్నారు. మరోవైపు రానున్న 48 గంటల్లో ముంబయి, చుట్టుపక్కల ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించడం.. కలవరాన్ని కలిగిస్తోంది.

ముంబైలో ఎక్కడ చూసినా వరద నీరే దర్శనమిస్తోంది. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఎటు చూసినా.. మోకాళ్ల లోతు నీళ్లలో నడిచే దృశ్యాలే కనిపిస్తున్నాయి. భారీ వృక్షాలు సైతం.. వర్షాల కారణంగా నేలకూలాయి. తాజాగా రత్నగిరిలోని తివారి ఆనకట్టకు గండి పడటంతో.. దిగువన ఉన్న 7 గ్రామాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 23 మందికి గల్లంతయ్యారు.

ఇక ఎక్కడికక్కడ భారీగా నీరు చేరడంతో.. రవాణా సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. పలు రైళ్లు, విమానసేవలు రద్దయ్యాయి. ముంబయి నుంచి హైదరాబాద్‌ సహా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన 203 విమానాల సేవలు రద్దయ్యాయి. మరో 350 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయంగా నడిచే విమానాలన్నీ ముంబైకి బదులు శంషాబాద్‌కు మళ్లిస్తున్నారు. ఇటు శంషాబాద్‌ నుంచి ముంబై వెళ్లే సర్వీసులను కూడా రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

2005 తర్వాత తొలిసారి 24 గంటల్లో ముంబైలో అత్యధిక వర్షపాతం నమోదైందని అక్కడి అధికారులు వెల్లడించారు. ఇక సహాయక చర్యలు కూడా అదే లెవెల్లో ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్‌, జాతీయ అత్యవసర స్పందనా దళం, నేవీ, ఫైర్‌ సిబ్బంది.. సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే మరో 48 గంటల పాటు అతి భారీ వర్షాలుపడే అవకాశం ఉండటంతో.. అలర్ట్‌ అయ్యారు. ఇటు వర్షాల కారణంగా మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, గవర్నర్‌ విద్యాసాగర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories