ట్రాఫిక్ నియమాల ఉల్లంఘిస్తే చాలాన్ మోత

ట్రాఫిక్ నియమాల ఉల్లంఘిస్తే చాలాన్ మోత
x
Highlights

ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలకు పాల్పడే వారిపై చలానాల మోత మోగడం మొదలయ్యింది. రోడ్లపై సురక్షిత ప్రయాణం కల్పించేందుకు ఆమోదించిన మోటారు వాహనాల చట్ట సవరణ అమలులోకి తీసుకు వచ్చింది ప్రభుత్వం.

ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలకు పాల్పడే వారిపై చలానాల మోత మోగడం మొదలయ్యింది. రోడ్లపై సురక్షిత ప్రయాణం కల్పించేందుకు ఆమోదించిన మోటారు వాహనాల చట్ట సవరణ అమలులోకి తీసుకు వచ్చింది ప్రభుత్వం. దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లో వాహనాల తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు.ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారిపై భారీ ఎత్తున జరిమానాలు విధిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్‌కు లోబడి వాహనాలను నడపాలని పోలీసులు సూచిస్తున్నారు. జరిమానాలు పెంచడం ద్వారా అయినా వాహనాలను డ్రైవింగ్ లో మార్పు వస్తుందని భావిస్తున్నారు.

కొత్త మోటారు వాహనాల చట్టం ప్రకారం.. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై 500 నుంచి 10 వేల రూపాయల వరకు జరిమానా, ఆరు నెలలపాటు జైలు శిక్ష విధించనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే విధించే 500 రూపాయల ఫైన్ ను 5వేలు వసూలు చేస్తున్నారు. మైనర్లు వాహనం నడిపితే గతంలో 500 రూపాయలు ఫైన్ వేసేవారు ఇప్పుడు 10 వేలు ఫైన్ విధించబోతున్నారు.

అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించే వాహానాలు అంబులెన్స్.. ఫైరింజన్లకు దారి ఇవ్వనట్లయితే పది వేలు జరిమానా విధించనున్నారు. అనర్హత వేటుపడిన వాహనాలకు ఒక్కో ప్రయాణికుడిపై రెండు వందల చొప్పున జరిమాన విధించనున్నారు. సీటు బెల్టు లేకుండా కారు నడిపినా.. హెల్మెట్ లేకుండా టూవీలర్ వాహనం నడిపినా వెయ్యి రూపాయలు జరిమానా విధించనున్నారు. ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే రెండు వేలు.. ఇతరులకు వాహనాలు ఇవ్వడం వల్ల వారు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే వాహనాల ఓనర్లకు 25వేల రూపాయలు జరిమానాతో పాటు మూడేళ్లు జైలు శిక్షతో పాటు వాహనం రిజిస్ట్రేషన్ రద్దు చేయనున్నారు. అదే విధంగా వాహనాలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించినట్లయితే 20వేల ఫైన్ విధించనున్నారు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories