Top
logo

పోలింగ్‌ బూత్‌కి సైకిల్‌పై సీఎం

పోలింగ్‌ బూత్‌కి సైకిల్‌పై సీఎం
X
Highlights

మహారాష్ట్ర, హరియానాతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న 52 స్థానాల్లో ఉపఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతుంది....

మహారాష్ట్ర, హరియానాతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న 52 స్థానాల్లో ఉపఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతుంది. మహారాష్ట్రలోని 288, హరియాణాలోని 90 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఓటర్లు, సెలబ్రేటిలు , వివిధ పార్టీలకు చెందిన నేతలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు.

హర్యానాలో పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోందని ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖత్తార్‌ చెప్పారు. పోలింగ్‌ బూత్‌కు సైకిల్‌పై వచ్చి కర్నాల్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఖత్తార్‌ ఓటు వేశారు. కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలన్నీ ఓడిపోయాయని, యుద్ధరంగాన్ని వీడి పారిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. వారు ఇచ్చిన హామీలకు విలువ లేదని ఆయన చెప్పారు.

Next Story