విమానంలో బట్టలిప్పేసిన విదేశీయుడు.. శంషాబాద్ లో విమానం అత్యవసర ల్యాండింగ్!

విమానంలో బట్టలిప్పేసిన విదేశీయుడు.. శంషాబాద్ లో విమానం అత్యవసర ల్యాండింగ్!
x
Highlights

ఓ విదేశీయుడు విమానంలో బట్టలు విప్పేసి అలజడి సృష్టించడంతో ఆ విమానాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన హైదరాబాద్ పోలీసులకు తలనొప్పి తెచ్చిపెట్టింది.

ఓ విదేశీయుడు విమానంలో బట్టలు విప్పేసి అలజడి సృష్టించడంతో ఆ విమానాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన హైదరాబాద్ పోలీసులకు తలనొప్పి తెచ్చిపెట్టింది. వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం మధ్యాహ్నం గోవా నుంచి ఢిల్లీ వెళుతున్న ఇండిగో విమానంలో ఓ విదేశీయుడు బట్టలు విప్పి నగ్నంగా బాత్రూమ్లో తిరిగి సిబ్బందికి చుక్కలు చూపించాడు. దీంతో సిబ్బంది విమానాన్ని అత్యవసరంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దించేశారు.

ఈ హంగామా చేసిన విదేశీయుడిని జర్మనీ దేశస్థుడిగా గుర్తించారు. విమానం శంషాబాద్ లో అత్యవసర లాండింగ్ చేసిన తరువాత నిందితుడిని వైద్యపరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి పంపించారు. ఆ నిందితుడు ఏవైనా డ్రగ్స్ తీసుకున్నాడేమో పరీక్షలు చేయించడానికి అతనిని ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. పోలీసులు అక్కడికి తీసుకు వెళ్ళేంత వరకూ అంతా బాగానే నడిచింది. అక్కడ నుంచి ఆ విదేశీయుడు పోలీసులకు మస్కా కొట్టి తప్పించుకుని పోయాడు. దీంతో పోలీసులు ఇప్పుడు అతని ఆచూకీ తెలుసుకునే పనిలో పడ్డ్డారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories