గుజరాత్‌లో చిక్కుకున్న మత్స్యకారులకు విముక్తి.. ప్రత్యేక చొరవ చూపిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

గుజరాత్‌లో చిక్కుకున్న మత్స్యకారులకు విముక్తి.. ప్రత్యేక చొరవ చూపిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
x
Highlights

లాక్‌డౌన్‌ నేపథ్యంలో గుజరాత్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మత్స్యకారులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చొరవతో వారిని...

లాక్‌డౌన్‌ నేపథ్యంలో గుజరాత్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మత్స్యకారులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చొరవతో వారిని స్వరాష్ట్రానికి పంపించేందుకు గుజరాత్‌ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గుజరాత్‌ ప్రభుత్వంతోపాటు, బీజేపీ గుజరాత్‌ శాఖ ఏర్పాటు చేసిన బస్సుల్లో వారంతా స్వరాష్ట్రానికి బయలుదేరుతున్నారు. ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతీ బస్సుకు ఓ ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసినట్లు గుజరాత్‌ ప్రభుత్వం వెల్లడించింది.

ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు చేసి, నెగటివ్‌ వచ్చిన వారినే ప్రయాణానికి అనుమతించినట్లు చెప్పింది. మరోవైపు గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. తొలి విడతాగా 36 బస్సుల్లో మత్స్యకారులను తరలిస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు కిషన్‌రెడ్డి సమాచారమందించారు. రెండ్రోజులకు సరిపడా ఆహారాన్ని గుజరాత్‌ ప్రభుత్వం అందిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories