కానిస్టేబుల్‌‌కు యావత్తు దేశం సెల్యూట్

కానిస్టేబుల్‌‌కు యావత్తు దేశం సెల్యూట్
x
Highlights

విధి నిర్వహణలో ఎంతటి అవరోధం ఎదురైనా వెనుదిరిగే ప్రసక్తే లేదంటున్నారు మన పోలీసులు. మొన్న మహారాష్ట్ర వరదల్లో తమను కాపాడిన రక్షణ సిబ్బంది కాళ్లను మొక్కి ఓ మహిళ కృతజ్ఞతలు చెప్పడంతో ఆ వీడియో ఎంతోమంది హృదయాలను కదిలించింది.

విధి నిర్వహణలో ఎంతటి అవరోధం ఎదురైనా వెనుదిరిగే ప్రసక్తే లేదంటున్నారు మన పోలీసులు. మొన్న మహారాష్ట్ర వరదల్లో తమను కాపాడిన రక్షణ సిబ్బంది కాళ్లను మొక్కి ఓ మహిళ కృతజ్ఞతలు చెప్పడంతో ఆ వీడియో ఎంతోమంది హృదయాలను కదిలించింది. అంతకంటే గ్రేట్ రెస్క్యూ గుజరాత్‌లో జరిగింది. ఇద్దరు చిన్నారులను తన భుజాలపై ఎత్తుకుని మోకాళ్ల లోతు నీళ్లలో ఒకటిన్నర కిలోమీటర్లు వరద ప్రవాహానికి ఎదురీదుతూ ఒడ్డుకు చేర్చాడు. ప్రాణాలను ఫణంగా పెట్టి చిన్నారులను కాపాడిన ఆ కానిస్టేబుల్‌కు యావత్‌ దేశం సెల్యూట్ చేస్తోంది. సూపర్ పోలీస్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇద్దరు చిన్నారులను తన భుజాలపై ఎత్తుకుని మీటరు కాదు పది మీటర్లు కాదు ఏకంగా ఒకటిన్నర కిలోమీటర్లు వరద ప్రవాహానికి ఎదురునడుస్తూ గట్టుపైకి చేర్చాడు. గుజరాత్‌‌లో ఓ సాధారణ కానిస్టేబుల్‌ చేసిన ఈ సాహసం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌‌ అవుతోంది. ప్రాణాలకు తెగించి చిన్నారులను కాపాడిన కానిస్టేబుల్‌ పృథ్వీరాజ్‌‌‌కు యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది. కానిస్టేబుల్‌ పృథ్వీరాజ్‌‌‌‌‌పై ప్రశంసల వర్షం కురిపించిన గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అతని అంకితభావాన్ని అభినందించండి అంటూ స్వయంగా వీడియోను అప్‌లోడ్ చేయడంతో ప్రముఖులతోపాటు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories