కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు

కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు
x
Highlights

కేంద్రకేబినేట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ట్రిపుల్ తలాఖ్‌ బిల్లును మంత్రివర్గం ఆమోదించింది. వచ్చే బడ్జెట్‌...

కేంద్రకేబినేట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ట్రిపుల్ తలాఖ్‌ బిల్లును మంత్రివర్గం ఆమోదించింది. వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. అలాగే జమ్మూకాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలల పాటు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కేబినేట్‌ నిర్ణయాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపించారు. అలాగే వైద్య విద్యలో సమూల సంస్కరణలు చేపట్టాలని కేబినేట్‌ నిర్ణయించింది. అందుకు సంబంధించి వైద్య విద్య ప్రక్షాళనకు వీలు కల్పించే ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ 2019 సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. అలాగే విద్యా సంస్థల బిల్లు 2019 కి కూడా ఆమోదం తెలిపింది. కేంద్ర విద్యా సంస్థల్లో భర్తీ చేసే ఉపాధ్యాయ నియామకాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories