Top
logo

దేశవ్యాప్తంగా అన్నిఎయిర్‌పోర్టుల్లో హై అలర్ట్‌

దేశవ్యాప్తంగా అన్నిఎయిర్‌పోర్టుల్లో హై అలర్ట్‌
Highlights

దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. కశ్మీర్‌పై భారత్‌ నిర్ణయంతో పాటు.....

దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. కశ్మీర్‌పై భారత్‌ నిర్ణయంతో పాటు.. స్వతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఐబీ హెచ్చరించింది. దీంతో దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో హై అలర్ట్‌ విధించారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 20 వరకు ఎయిర్‌పోర్టుల్లో హై అలర్ట్‌ విధించారు. అన్ని రకాల పాస్‌లను రద్దు చేసిన ఎయిర్‌పోర్ట్‌ అధికారులు.. సందర్శకుల అనుమతిని కూడా రద్దు చేశారు. అన్ని ఎయిర్ పోర్టులో సందర్శకులకు అనుమతి నిరాకరించారు. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్ పోర్టుల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. సామాన్య ప్రజలే టార్గెట్‌గా విరుచుకుపడేలా కుట్రలు జరుగుతున్నాయని.. ఆత్మాహుతి దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది.

Next Story