చచ్చింది మేకే కదా అనుకుంటే.. కంపెనీ సొమ్ము మూడుకోట్లు ఊడ్చేసింది!

చచ్చింది మేకే కదా అనుకుంటే.. కంపెనీ సొమ్ము మూడుకోట్లు ఊడ్చేసింది!
x
Highlights

మార్కెట్ లో ఓ మేకను కొంటె మహా అయితే ఆరు వేలు లేదా ఇంకా ఎక్కువ అనుకుంటే ఓ పదివేలకు కాస్త అటూ ఇటూగా ఉంటుంది. కానీ, ఓ మేక చనిపోయి.. తన యజమానులకు అరవైవేలు ఇప్పించింది. ఇది పెద్ద విశేషం కాదు అనుకుంటే.. ఆ మేక చావుతో ఒక బొగ్గు కంపెనీకి ఏకంగా మూడు కోట్ల నష్టం వచ్చింది.

మార్కెట్ లో ఓ మేకను కొంటె మహా అయితే ఆరు వేలు లేదా ఇంకా ఎక్కువ అనుకుంటే ఓ పదివేలకు కాస్త అటూ ఇటూగా ఉంటుంది. కానీ, ఓ మేక చనిపోయి.. తన యజమానులకు అరవైవేలు ఇప్పించింది. ఇది పెద్ద విశేషం కాదు అనుకుంటే.. ఆ మేక చావుతో ఒక బొగ్గు కంపెనీకి ఏకంగా మూడు కోట్ల నష్టం వచ్చింది. అవునా.. అని నోరు నొక్కుకోకండి.. ఈ కథనం చదివితే మీకు విషయం అర్థం అవుతుంది. ఏ జీవినీ తక్కువ లేక్కేయకూడదని తెలుసుకుంటారు.

ఈ సంఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ నెల ఒకటిన ఒడిశాలోని మహానంది కోల్ ఫీల్డ్ లిమిటెడ్ బొగ్గు నిక్షేపాలను వెలికితీస్తుంది... దానిని బొగ్గు గనుల నుంచి రైల్వే వ్యాగన్లకు బొగ్గును సరఫరా చేసేందుకు ఓ ట్రక్కును ఏర్పాటు చేసుకుంది. ఈ క్రమంలో ఆ ట్రక్కుని ఢీకొని ఓ మేక చనిపోయింది. ఉదయం 11 గంటల సమయంలో ఇది చోటు చేసుకుంది .

దీనితో ఆ మేక చనిపోయినందుకు గాను నష్ట పరిహారం చెల్లించాలని స్థానికులు డిమాండ్ చేసారు. అక్కడికి పోలీసులు కూడా వచ్చారు. అందరి మధ్య ఓ సఖ్యత కుదిరాక చనిపోయిన మేకకి గాను 60 వేలు నష్టపరిహారం చెల్లించారు. ఈ తతంగం అంతా ముగిసేసరికి మధ్యాహ్నం 2.30 అయింది. ఈ మూడున్నర గంటల పాటు బొగ్గు రవాణా నిలిచిపోవడం వల్ల కంపెనీకి రూ.1.4 కోట్లు నష్టం వచ్చింది. రవాణా ఆలస్యం కావడం వల్ల రైల్వేకి రూ.1.28 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. దీంతోపాటు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల రూ.46 లక్షల నష్టం వచ్చింది...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories