ఈ నెల 17 నాటికి గ్రీన్ జోన్‌గా గోవా: సీఎం ప్రమోద్ సావంత్

ఈ నెల 17 నాటికి గ్రీన్ జోన్‌గా గోవా: సీఎం ప్రమోద్ సావంత్
x
Highlights

ఈ నెల 17 నాటికి గోవా కరోనా రహిత రాష్ట్రంగా మారుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత పన్నెండు రోజులుగా గోవాలో ఒక్క...

ఈ నెల 17 నాటికి గోవా కరోనా రహిత రాష్ట్రంగా మారుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత పన్నెండు రోజులుగా గోవాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదన్న ఆయన రాష్ట్రంలో రెండు జిల్లాల్లో మినహా మిగిలిన రాష్ట్ర మంతా ఇప్పటికే గ్రీన్ జోన్లో ఉందని చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిందన్నారు

గోవాలో కరోనా ప్రభావం రోజు రోజుకు తగ్గుతూ వస్తోంది. గత 12 రోజులుగా గోవాలో కరోనా కేసులు కొత్తగా నమోదు కాలేదని సావంత్ చెప్పారు. ఇప్పటి వరకూ తమ రాష్ట్రంలో 7 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయని, ఆ కేసులన్నీ నార్త్ గోవాకు చెందినవేనని సీఎం తెలిపారు. ఏప్రిల్‌ 17 నాటికి కరోనా రహిత రాష్ట్రంగా గోవా మారుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ధీమా వ్యక్తం చేశారు.

నిత్యావసర వస్తువులతో తమ రాష్ట్రంలోకి వచ్చే వాహనాలన్నీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శానిటైజింగ్ మార్గాల ద్వారానే రావాలని ఆదేశించారు. గతంలో ప్రకటించినట్టు ఏప్రిల్ 14 నుంచి కాకుండా ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులకు హాజరుకావాలని ఆదేశించారు. లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో ప్రజలందరూ తమకు సహకరించాలని కోరారు. ప్రస్తుతం కరోనా సోకి చికిత్స పొందుతున్న వారు కూడా నేడో రేపో డిశ్చార్జ్ అవుతారనీ, 17నాటికి రాష్ట్రం మొత్తం గ్రీన్ జోన్ లోకి వచ్చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గోవాలో రెండు జిల్లాలు మినహా దక్షిణ గోవాను గ్రీన్ జోన్‌గా ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories