2019 సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

2019 సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
x
Highlights

2019 సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 11 న తొలిదశ సార్వత్రిక...

2019 సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 11 న తొలిదశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతుంది.. ఏప్రిల్ 18 న రెండో విడత, మూడో విడత 23న, ఏప్రిల్ 29న నాల్గో విడత, ఐదో విడత మే 6న, ఆరో విడత మే 12న, మే 19న ఏడవ విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. మే 23 న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఆంధ్రప్రదేశ్ సింగల్ ఫేజ్ లోనే ఎన్నికలు.. అంటే పార్లమెంటు, అసెంబ్లీకి ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి.. ఆంధ్రా , తెలంగాణాకు ఈనెల(మార్చి) 18న నోటిఫికేషన్ రానుంది.18 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లకు చివరి తేదీ ఈనెల(మార్చి) 25. ఈనెల(మార్చి)26 న నామినేషన్ల పరిశీలన. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఈనెల 28. పోలింగ్ డేట్ : ఏప్రిల్ 11న. మే 23 న ఎన్నికల ఫలితాలు. ఆంధ్రప్రదేశ్ లో 25 లోకసభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు ఊన్నాయి. ఇవాల్టినుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories